'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటున్న అందాల భామ నిధి అగర్వాల్. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న నిధి.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో నిధి అగర్వాల్ ప్రేమలో మునిగి తెలుతోందని.. ఏడడుగులు వేయడానికి రెడీ అవుతున్నారని నివేదికలు వెల్లడించాయి. వీరిద్దరూ కలిసి చేసిన 'ఈశ్వరన్' సినిమా షూటింగ్ సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డారని.. తరచూ పలు పబ్లిక్ ప్రదేశాల్లో కలిసి కనిపిస్తున్నారని తమిళ వర్గాల్లో వార్తలు వచ్చాయి. అయితే రిలేషన్ షిప్ లో ఉందనే వార్తలను నిధి టీమ్ ఖండించినట్లు తెలుస్తోంది.
"నిధి అగర్వాల్ మీద వస్తున్న రూమర్స్ అన్నీ అవాస్తవం. ఆమె రిలేషన్ షిప్ స్టేటస్ గురించి పుకార్లు ఎలా ప్రారంభమయ్యాయో తెలియడం లేదు. మీడియా సోషల్ మీడియాలలో ఈ ఊహాగానాలు రావడానికి కారణం ఏమిటనేది అర్థం కావడం లేదు" అని ఇస్మార్ట్ బ్యూటీ నిధి సన్నిహిత వర్గాలు తెలిపాయని కథనాలు వస్తున్నాయి.
నిధి అగర్వాల్ ప్రస్తుతం ''హీరో'' మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా జనవరి 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న నిధి.. మీడియా ఇంటరాక్షన్ లో తన పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు అడగకుండా చూడాలని మేకర్స్ ను కోరినట్లు టాక్ నడుస్తోంది.
అయితే నిధి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ''అబ్బాయిల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో కల ఉంటుంది. నాకు మాత్రం గౌరవించే వ్యక్తులంటే చాలా ఇష్టం. నన్నే కాదు.. చుట్టుప్రక్కల అందరితోనూ గౌరవభావంతో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మా నాన్నలా ఉండాలి'' అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.
కాగా, 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో విజయం అందుకున్న నిధి అగర్వాల్ కు తెలుగు తమిళ బాషల్లో మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తోంది. అలానే తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ తో ఓ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే క్రమంలో ఏప్రిల్ నుంచి హిందీలో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు నిధి వెల్లడించారు.