నిధి అగర్వాల్.. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నామైఖెల్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోస్తూనే తన డాన్సులతో అదరగొట్టింది. కానీ ఎందుకో బాలీవుడ్ ప్రేక్షకులు ఈ బ్యూటీని తిరస్కరించారు. దీంతో అక్కడ లాభం లేదనుకొని టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా పరాజయం పాలైనా అందాలను ఆరబోసి తెలుగు ప్రేక్షకులకి గుర్తుండి పోయింది. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' చిత్రంలోనూ నటించింది. ఈ చిత్రం కూడా నిధికి నిరాశనే మిగిల్చింది. అయితే గతేడాది డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించింది నిధి. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది నిధి అగర్వాల్. ఈ చిత్రంతో హీరోయిన్ గా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్లు వెల్లువలా వస్తాయని అందరూ ఆశించారు. కానీ అమ్మడికి ఒక్కటంటే ఒక్క క్రేజీ ఆఫర్ కూడా రాలేదు. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో ఒక సినిమాలో నటించే అవకాశం మాత్రం వచ్చింది.
బాలీవుడ్ టాలీవుడ్ లలో లక్ టెస్ట్ చేసుకున్న అందాల నిధి కన్ను తర్వాత కోలీవుడ్ మీద పడింది. తమిళ్ లో జయం రవి హీరోగా నటిస్తున్న 'భూమి' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా తమిళ్ యంగ్ మాస్ హీరో శివ కార్తికేయన్ సినిమాలో ఛాన్స్ కోసం తెగ ట్రై చేస్తుంది నిధి. ఈ సినిమాకి శివ కార్తికేయన్ యే నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. దీంతో మనోడు ఈ బ్యూటీని హీరోయిన్ గా తీసుకోవడానికి ఒక షరతు పెట్టాడట. ఈ సినిమాలో హీరోయిన్ తమిళ్ తెలిసీ తెలియనట్లు మాట్లాడే స్టేజి నుంచి ఫ్లూయెంట్ గా మాట్లాడే స్టేజికి వచ్చే క్యారెక్టర్ లా తన పాత్ర ఉండబోతోందట. దీంతో తమిళ్ ఫుల్ గా నేర్చుకోమని.. ఈ క్వారంటైన్ సమయాన్ని ఆ విధంగా యూజ్ చేసుకోమని సలహా ఇచ్చినట్లు తమిళ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఈ మధ్య ఆన్లైన్ లో యాక్టింగ్ క్లాసులు అటెండ్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు తమిళ స్పోకెన్ క్లాసెస్ కి ఆన్లైన్ లో హాజరు అవుతుందట.
క్వారంటైన్ లో తమిళ్ ప్రాక్టీస్ చేస్తూ ఇది ఏ లాంగ్వేజ్ అంటూ ఇంస్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టింది. పాపం నిధి.. అవకాశాల కోసం చాలానే కష్టపడుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉండగా నిధి అగర్వాల్ శాండిల్ వుడ్ లో 'జేమ్స్' అనే సినిమాలో నటిస్తోంది. ఇది తెలిసిన కొంతమంది బాలీవుడ్ పొమ్మంది.. టాలీవుడ్ అయిపోయింది.. ఇప్పుడు కోలీవుడ్ శాండిల్ వుడ్ ల మీద పడింది నిధి పాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత అయినా మన అందాల ఘని నిధికి ఛాన్సెస్ వెల్లువలా వచ్చి పడతాయేమో చూడాలి.