పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - జాగర్లమూడి క్రిష్ కాంబినేషన్ లో ఓ పీరియాడికల్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యుల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ ఏయమ్ రత్నం నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మొఘలాయుల కాలం నాటి ఫిక్షనల్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపిస్తాడని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో చార్మినార్ సెట్.. హైదరాబాద్ శివార్లలో ఓ దర్బార్ సెట్ వేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం.
ఇప్పటికే నిధి అగర్వాల్ కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొందని తెలుస్తోంది. ఏదేమైనా నిధి బంపరాఫర్ కొట్టేసిందనే చెప్పాలి. 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన గ్లామరస్ నిధి.. `ఇస్మార్ట్ శంకర్`తో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు పవర్ స్టార్ తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరో హీరోయిన్ గా కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ 'అయ్యప్పనుమ్ కోశీయుమ్' రీమేక్ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే క్రిష్ సినిమాలో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.