ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 60 మంది చిన్నారులకు తల్లి పాలు దానం చేసింది నిధిపర్మార్ హిరానందా. తన బిడ్డకు పాలందిస్తూ ఇంకా ఎక్కువగా వచ్చిన పాలను మరో 60 మంది చిన్నారులకు లాక్ డౌన్ లో.. కరోనా కష్టకాలంలో అందించి వారందరికీ తల్లి అయ్యింది. వారి ప్రాణాలను కాపాడింది.
‘సాండ్ కి ఆంఖ్’ చిత్ర నిర్మాత అయిన నిధి పర్మార్ ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మార్చి -మే నెలల మధ్య కాలంలో సుమారు 42 లీటర్ల పాలను ఆమె చిన్నారుల కోసం దానం చేసింది. మొదట తన బిడ్డకు పాలు పట్టి ఎక్కువగా ఉన్న పాలను ఖార్ ముంబైలోని సూర్య ఆస్పత్రికి ఆమె దానం చేసింది.
2019 నుంచి సూర్య ఆస్ప్రత్రిలో రొమ్ము పాలను స్టోర్ చేసే పాల బ్యాంకు ఉంది. దానికి నిధి పాలను దానం చేసింది. అక్కడికి వెళ్లి మరీ తన పాలు ఎవరికి ఇస్తున్నారన్నది చూసింది. నిధి పాలను ఏకంగా 60మంది చిన్నారులకు ఆస్పత్రి సిబ్బంది పట్టించారు. దీంతో తాను మరో ఏడాది పాటు పాలు దానం చేస్తానని నిధి ఆనందంగా చెబుతోంది.
నిధిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది తమ చనుబాలును దానం చేయడానికి ముందుకు రావాలని నిపుణులు కోరుతున్నారు. ప్రతి తల్లి తన బిడ్డకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి వృథాగా పోయే పాలను ఇలా దానం చేయడం మంచిదని చిన్నారులకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన వారు అవుతారని వైద్యులు పేర్కొంటున్నారు. నిధి చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.