మెగా హీరోను కలవడానికి ఫ్యామిలీ వెళ్తోంది

Update: 2016-08-17 09:30 GMT
ఇప్పుడు మెగా హీరోలందరిలోనూ యమా బిజీగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే.. వెంటనే మనం వరుణ్‌ తేజ్‌ పేరు చెప్పొచ్చేమో. ఎందుకంటే మనోడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల షూటింగ్ చేస్తున్నాడు. మూడోది కూడా దాదాపు సెట్టయినట్లే. అందుకే ఈ బిజీ స్టార్ ఇంటికి రాకపోవడంతో ఫ్యామిలీ మెంబర్లే తనని కలవడానికి షూటింగ్ స్పాట్ కి వెళ్తున్నారు.

నిజానికి జూలై 10 వరకు వరుణ్‌ ఫుల్ ఖాళీ. అమెరికాలో చెక్కెర్లు.. పెదనాన్న సినిమా ముచ్చట్లు తప్పించి.. ఎటువంటి వర్కూ చేయలేదు. కాని 10న స్పెయిన్ లో ''మిష్టర్‌'' సినిమా షూటింగ్ కోసం అడుగుపెట్టాక ఫుల్ బిజీ అయిపోయాడు. శ్రీను వైట్ల డైరక్షన్లో తీరికలేనంతగా అక్కడ షూటింగ్ చేశారు. దాదాపు నెల రోజులు అక్కడే షూటింగ్ చేసి ఇంటికి తిరిగొచ్చిన వరుణ్‌.. ఇంట్లో కేవలం ఒక్కరోజే ఉన్నాడు. ఆ తరువాత వెంటనే నిజామాబాద్ జిల్లా భాన్సువాడ చేరుకుని అక్కడ శేఖర్‌ కమ్ముల ''ఫిదా'' షూటింగులో పాల్గొంటున్నాడు. వారం నుండి అక్కడే మకాం వేశారులే. అందుకే తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి కూడా పెద్దగా తీరిక దొరకట్లేదట.

వరుణ్‌ ను బాగా మిస్సయిన మమ్మీ.. అలాగే చెల్లెలు నిహారిక.. ఇప్పుడు తమ బిడ్డను పనిచేస్తుండగా చూసి ఆస్వాదించాలని నిజామాబాద్ వెళ్తున్నారట. మొత్తానికి ఇంటికి రాలేనంత బిజీగా కుర్రాడుంటే.. ఇల్లే అక్కడికి తరలి వెళ్తోందనమాట.

Tags:    

Similar News