#నిహారిక హీరో .. 2021లోనే బ‌రిలో దిగుతున్నార‌ట‌

Update: 2020-12-21 04:45 GMT
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ఐజీ కుమారుడు చైతన్య జోన్నలగడ్డను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లో ఈ జంట‌ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. నూతన వధూవరులు ప్రస్తుతం ఈ కొత్త దశ జీవితంలో ఆనందకరమైన సమయాన్ని ఆస్వాధిస్తున్నారు.

ఈ పెళ్లికి  ముందే నిశ్చితార్థ ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ హీరో అవుతాడ‌ని ఊహాగానాలు సాగాయి. ఒడ్డు పొడుగు ఉన్న‌ అంద‌గాడు మెగా టీమ్ లో చేర‌డం ఖాయ‌మేన‌ని భావించారంతా. ఇంతలోనే  ఊహాగానాల్ని నిజం చేస్తూ.. చైతన్య వచ్చే ఏడాది ఎప్పుడైనా హీరోగా  అరంగేట్రం చేసే వీలుంద‌ని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం లేకపోయినప్పటికీ కొణిదెల వారి అల్లుడి అందమైన రూపం అప‌రిమిత ఊహాగానాలకు ఆజ్యం పోస్తోంది.

చైతన్య ISB నుండి గ్రాడ్యుయేట్. అతను ప్రస్తుతం హైదరాబాద్ లోని మ‌ల్టీనేష‌న్ కంపెనీలో టెకీగా పనిచేస్తున్నాడు. అత‌డు హీరో అయ్యేందుకు వంద‌శాతం ఛాన్సులున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ త‌ర‌హాలోనే నాగ‌బాబు అల్లుడు కూడా హీరోగా బ‌రిలో దిగుతార‌న్న ఊహాగానాలు మెగాభిమానుల్లో సాగుతున్నాయి.
Tags:    

Similar News