మహారాణి యేసుబాయిగా రష్మిక.. స్టన్నింగ్ లుక్
ఆమె ధరించిన దుస్తులు, ఆభరణాలు హిస్టారికల్ అక్షరాల్లో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. ఆ పోస్టర్ చూసిన వెంటనే యేసుబాయి పాత్రపై ప్రేక్షకులలో ఒక కొత్త ఆసక్తి పెరిగింది.
భారతీయ చరిత్రలో మహారాజ శంభాజీ బోంస్లే వ్యక్తిత్వం, వీరోచిత గాధలు ప్రధాన అంశాలుగా హైలెట్ అయ్యాయి. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని "చావా" అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవిత కథను తెలుపుతోంది. అతని ధైర్యం, త్యాగం, దేశభక్తిని ఈ చిత్రంలో ప్రతిబింబించనున్నారు. ప్రముఖ నటుడు విక్కీ కౌశల్ శంభాజీ పాత్రలో నటిస్తుండగా, అక్షయే ఖన్నా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దినేష్ విజన్ నిర్మాణంలో మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ చిత్ర ట్రైలర్ జనవరి 12న విడుదల కానుండగా, సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హిస్టారికల్ డ్రామాలో ఉన్న డిటైలింగ్, గ్రాండియర్ విజువల్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ అంటున్నారు. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరింత హైలైట్‌గా నిలవనుంది.
ఇక శంభాజీ జీవితంలో అతని భార్య యేసుబాయి పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో సినిమా ద్వారా ఆవిష్కరించనున్నారు. ఇటీవల కాలంలో రష్మిక మందన్న వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది. పుష్ప 2 లో ఆమె నటన ప్రేక్షకులను ఉర్రూతలూగించగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇప్పుడు చావాలో ఆమె పాత్ర కూడా చిత్రానికి ప్రాణం పోసేలా ఉంటుందని చెబుతున్నారు.
హిస్టారికల్ డ్రామాలో నటించడం రష్మికకు కొత్త అనుభవం. ఆమె అందించిన నటన, హావభావాలు సినిమా బలాన్ని మరింత పెంచుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న కొత్తగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్ లో ఆమె లుక్ అందర్నీ ఆకట్టుకుంది. రాజసంగా అలంకరించిన ఆమెను చూస్తుంటే, ఒక మహారాణి ఆత్మవిశ్వాసం, సంస్కారం స్పష్టంగా ప్రతిఫలించింది.
ఆమె ధరించిన దుస్తులు, ఆభరణాలు హిస్టారికల్ అక్షరాల్లో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. ఆ పోస్టర్ చూసిన వెంటనే యేసుబాయి పాత్రపై ప్రేక్షకులలో ఒక కొత్త ఆసక్తి పెరిగింది. చావా సినిమా చరిత్రలో కీలకమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకునేందుకు సిద్ధంగా ఉందని అనిపిస్తోంది. ఈ సినిమా విజువల్స్, కథ, రష్మిక పాత్ర చిత్రణ ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. రష్మిక తన పాత్రకు ఏ విధంగా ప్రాణం పోస్తుందో, ఆమె నటన ఈ సినిమా విజయానికి ఎంత పెద్ద శక్తిని అందిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, హిస్టారికల్ డ్రామాలలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.