ఆర‌డుగుల బుల్లెట్టులా మెగా ప్రిన్సెస్ లుక్కు అదిరెను

Update: 2020-10-21 17:34 GMT
మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల నిశ్చితార్థం ఐజీ కుమారుడు చైత‌న్య‌తో పూర్త‌యిన సంగ‌తి తెలిసినదే. డిసెంబ‌ర్ లో ఈ జంట వివాహం జ‌ర‌గ‌నుంది. నిశ్చితార్థం అనంత‌రం స‌ఖుడితో పాటు నిహారిక ఫోటో షూట్లు అభిమానుల్లో వైర‌ల్ అయ్యాయి.

ఇటీవ‌ల నిహారిక ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయి నిరంత‌రం జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోల్ని ఇటీవ‌ల మెగా ప్రిన్సెస్ నిహారిక ఇన్ స్టాలో షేర్ చేశారు. నిహారిక లుక్ ర‌క‌ర‌కాల సాంప్ర‌దాయ దుస్తుల్లో అలాగే ఫార్మ‌ల్ లుక్ లో ఎలా ఉండ‌నుంది? అన్న‌ది కూడా రివీలైంది.

తాజాగా మ‌రో రేర్ లుక్ ని నిహారిక షేర్ చేశారు. ఈ ఫోటో చూడ‌గానే ఆర‌డుగుల బుల్లెట్టు! అంటూ పొగిడేయాల్సిందే. సింపుల్ ట్రెడిష‌న‌ల్ లెహెంగా త‌ర‌హా డిజైన‌ర్ దుస్తుల్లో స్మైలిస్తూ నిహారిక ఫోటోకి ఫోజిచ్చారు. చ‌క్క‌ని క‌ట్టు బొట్టు సాంప్ర‌దాయాన్ని ఎలివేట్ చేస్తున్న ఈ ఫోటో ఎంతో హుందాగా ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ కి ఇచ్చిన హాట్ ఫోజుతో పోల్చి చూస్తే ఇది పూర్తి విరుద్ధ‌మైన‌ది. నిహారిక త‌న‌ని తాను విల‌క్ష‌ణంగా ప్రెజెంట్ చేసుకుంటున్న తీరు.. ఫ్యాష‌నిస్టాగా ఆవిష్క‌‌రించుకుంటున్న వైనం చూస్తుంటే ఆస‌క్తి రేకెత్తుతోంది క‌దూ?
Tags:    

Similar News