ఒక మనసు.. మెగా బ్రదర్ నాగేంద్రబాబు కూతురు నీహారిక హీరోయిన్ గా అరంగేట్రం చేస్తున్న మూవీ ఇది. ఈ చిత్రాన్ని నీహారిక సినిమా అని అందరూ అంటుంటే హీరో కొంచెం ఫీల్ అవుతున్న మాట వాస్తవమే కానీ.. ఇప్పుడీ మూవీకి బిజినెస్ కంప్లీట్ అయిపోవడం, అది కూడా టేబుల్ ప్రాఫిట్స్ తో డీల్స్ క్లోజ్ చేయడం మాత్రం.. పక్కాగా నీహారిక నే కారణం. ఒక మనసు చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు బాగానే పెట్టుబడి పెట్టారు.
ఓ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి.. నిర్మాతలు మధుర శ్రీధర్ - టీవీ9 - ఎల్ ఏ టాకీస్ లు బాగానే లాభాలు జేబులో వేసుకున్నారు. ఇప్పటికే చాలా ఏరియాల్లో బిజినెస్ కంప్లీట్ అయిపోగా.. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన డీల్స్ కూడా ఫైనలైజ్ అవుతాయని తెలుస్తోంది. ఇదంతా నీహారిక ఎంట్రీపై క్రేజ్ కారణంగానే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. అందుకే ఒక మనసు చిత్రం విషయంలో ప్రమోషన్స్ అంతా నీహారిక చుట్టూనే తిరుగుతున్నాయి.
అసలు ఈ మూవీకి ఇంత హైప్ రావడానికి అల్లు అర్జున్ కారణమంటే ఆశ్చర్యం వేయచ్చు. ఒక మనసు ఆడియో విడుదల ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ అరుస్తున్న వారికి బన్నీ పీకిన క్లాస్ బాగా హల్ చల్ చేసింది. ఆ వివాదం తర్వాత ఒక మనసు గురించి జనాల్లోకి బాగా వెళ్లిందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. మొత్తానికి అల్లు ఫ్యామిలీ చలవతో.. మెగా డాటర్ మొదటి సినిమా ముందుగానే లాభాలు కళ్లచూస్తోందన్నమాట.