మేకప్ ఛాలెంజ్ పై స్పందించిన మెగా డాటర్..

Update: 2020-04-27 17:30 GMT
కరోనా వైరస్ కారణంగా దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ప్రతీ వ్యక్తీ ఇంట్లోనే ఉంటూ కరోనా నివారణ చర్యల్లో భాగమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ స్టార్స్ సరికొత్తగా ఆలోచించి ఇంట్లోనే ఉంటూ ఫ్యాన్స్ ని ఎంటర్‌ టైన్ చేస్తున్నారు. హీరోలంతా 'బీ ది రియల్ మెన్' ఛాలెంజ్ అంటూ ఇంట్లో భార్యలకు సాయపడుతుంటే.. మెగా ఫ్యామిలీ లేడీస్ మాత్రం ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే మేకప్ టెక్నిక్స్ పై వీడియోస్ రూపొందిస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలలో మెగా ఫ్యామిలీ లేడీస్ అంతా 'పాస్ ది బ్రష్' అనే కొత్త ఛాలెంజ్ తో "మేకప్ వేసుకోక ముందు - వేసుకున్న తరువాత డాన్స్ చేస్తూ వీడియో తీశారు'. ఈ వీడియోలలో మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లతో పాటు నాగబాబు కూతురు నిహారిక - అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సహా ఇంకొందరు మెగా ఫ్యామిలీ లేడీస్ పాల్గొన్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లేడీ ఫ్యాన్స్ అంతా కనెక్ట్ అవుతున్నారట. లాక్‌ డౌన్ కారణంగా ఇంట్లోనే నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ మేకప్ ఛాలెంజ్ ఆలోచన ఎవరిది? మీకెందుకు చేయాలనిపించింది? అనే ప్రశ్నకు స్పందించి.. తమ ఫ్యామిలీ లేడీస్ వాట్సాప్ గ్రూప్‌లో శ్రీజ షేర్ చేసిన ఓ వీడియో చూశాక ఈ మేకప్ ఛాలెంజ్ చేయాలనే ఆలోచన వచ్చిందని నిహారిక తెలిపింది. హిందీలో ఉన్న ఆ మేకప్ వీడియోను తెలుగులో చేస్తే బాగుంటుందని భావించి మెగా ఫ్యామిలీ లేడీస్ అందరినీ ఒప్పించి ఈ ఛాలెంజ్‌ లో భాగం చేశామని ఆమె తెలిపింది. మొత్తానికి శ్రీజ అక్క వల్లే వీడియో చేయాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పింది నిహారిక.
Tags:    

Similar News