చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర చేసినా చాలని ఆయన కుటుంబ హీరోలు పదే పదే చెబుతుంటారు. అయితే ఆ అవకాశం కొద్దిమంది హీరోలకే వచ్చింది. కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్ నిహారికకి మాత్రం చాలా తొందరగా అవకాశం లభించింది. చిరంజీవి కథానాయకుడిగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `సైరా`లో నిహారిక ఓ పాత్రలో కనిపించబోతోంది. అది ఎలాంటి పాత్ర అనేది నిహారిక బయటపెట్టింది. ఒక బోయ అమ్మాయిగా కనిపించబోతోందట. అది కూడా రెండు సన్నివేశాల్లోనేనట. సంభాషణలు కూడా ఉండవని చెప్పుకొచ్చింది నిహా.
ఆ పాత్ర అవకాశం గురించి ఆమె మాట్లాడుతూ... ``సైరాకి నిర్మాత అయిన మా అన్నయ్య చరణ్ ని పెద్దనాన్న సినిమాలో నటించే అవకాశం గురించి అడుగుతూ ఉన్నా. ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలని బతిమాలా. అన్నయ్య మాత్రం ` ఆ విషయం నేనెలా చెబుతాను - దర్శకుడు చెబితే కదా నీకు అవకాశం వస్తుంది` అన్నాడు. అప్పుడే దర్శకుడు సురేందర్ రెడ్డి వచ్చాడు. ఆయనతో నా కోరికని చెప్పా. `మీరు నిజంగా చేస్తారా?` అని అడిగారు. డైలాగ్స్ లేకపోయినా ఫర్వలేదా? అన్నారు. పర్లేదు చేస్తా అని చెప్పడంతో నాకు క్యారెక్టర్ ఓకే అయ్యింద``ని చెప్పుకొచ్చింది నిహారిక. అయినా నిహారికలాంటి అమ్మాయిని రెండు సన్నివేశాల్లో.. అది కూడా మాటల్లేకుండా పరిమితం చేయడమనేది మాత్రం టూ మచ్ అనిపించడం లేదూ! మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే సైరా విడుదల వరకు ఆగాల్సిందే.