ఇలా ఉంటే నన్ను నేను చూసుకున్నట్టుంది

Update: 2017-10-30 04:11 GMT
తనకు బాగా అలవాటయిన లుక్ ను వదిలేసి చాలా కాలంగా ఢిపరెంట్ లుక్ లోనే కనిపిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఫస్ట్ సినిమా హ్యాపీడేస్ నుంచి దాదాపుగా కొంచెం అటూ ఇటూగా ఒకే తరహా లుక్ తో కనిపించిన నిఖిల్ ఈమధ్య స్టయిల్ మార్చి గుబురు గెడ్డంతోనే కనిపించాడు. ఇప్పుడు మళ్లీ పాత లుక్ లోకి వచ్చేసిన ఈ యంగ్ హీరో గెడ్డం పెంచి తిరగాల్సి రావడంతో ఏడాదిగా తన దవడలు ఎలా ఉంటాయో కూడా మర్చిపోయాను అంటున్నాడు.

స్ట్రయిట్ సబ్జెక్టుల తోనే మంచి హిట్లు కొట్టిన నిఖిల్ చాలాకాలం తర్వాత రీమేక్ చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్ లో కన్నడ సూపర్ హిట్ మూవీ కిరాక్ పార్టీ తెలుగు వెర్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసమే నిఖిల్ గెడ్డం పెంచి కనిపించాడు. తాజాగా ఆ గడ్డం తీసేసి తన ఒరిజినల్ లుక్ తో ఫొటో దిగి ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘‘ఏడాది తర్వాత నా గడ్డం తీశా. మళ్లీ నన్నునేను చూసుకున్నట్లు ఉంది. గడ్డం కారణంగా నా దవడలు ఎలా ఉంటాయో మర్చేపోయా’ అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ఏడాది కేశవ సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. బాహుబలి-2 థియేటర్లలో ఉండగానే ఈ సినిమా రిలీజైంది. అయినా మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రస్తుతం చేస్తున్న కిరాక్ పార్టీ రీమేక్  తో మంచి కమర్షియల్ హిట్ వస్తుందని నిఖిల్ ఆశిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అందమైన సంయుక్త హెగ్డే తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
Tags:    

Similar News