'కార్తీకేయ‌-3' పై నిఖిల్ ఇంట్రెస్టింగ్ అప్టేడ్!

Update: 2022-09-24 05:03 GMT
'కార్తికేయ' ప్రాంచైజీ పాన్ ఇండియాలో ఇప్పుడో బ్రాండ్ గా వెలిగిపోతుంది. 'కార్తికేయ‌-2' పాన్ ఇండియాలో భారీ విజ‌యం సాధించ‌డంతోనే ఈ క్రేజ్ క్రియేట్ అయింది. కార్తికేయ మొద‌టి భాగాన్ని సైతం ప్రేక్ష‌కులిప్పు డు త‌వ్వి తీస్తున్నారు. నెట్టింట కార్తికేయ  హాట్ టాపిక్ గా మారింది. మొద‌టి భాగంలో ఏం చూపించారు? అన్న ఎగ్జైట్ మెంట్ తో సెర్చ్ చేస్తున్నారు.

ఇక 'కార్తికేయ‌3' ప్ర‌క‌ట‌నే ఇప్పటికే వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. అంత‌ర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు చందు మొండేటి రివీల్ చేసారు. రెండు భాగాల స‌క్సెస్ ని మించి థ‌ర్డ్ పార్ట్ కి స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి హీరో నిఖిల్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్  అందించారు. అతి త్వ‌ర‌లోనే కార్తికేయ‌-3 షూటింగ్ ప్రారంభిస్తున్న‌ట్లు నిఖిల్ తెలిపారు.

ఈ చిత్రాన్ని ఏకంగా 3 డీలోనే రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మొత్తానికి కార్తికేయ‌-3ని భారీ స్పాన్ తో తెర‌కెక్కించ‌డానికి యూనిట్  రంగం సిద్దం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన రెండు భాగాలు స‌మాధానం లేని ప్ర‌శ్నే ఉండ‌దు. అలా ఉంటే అది న‌ప్ర‌శ్నే కాదు అన్న కోణాన్ని బేస్ చేసుకుని ఆస‌క్తిక‌ర నేపథ్యాన్ని ఎంచుకుని తెర‌కెక్కించారు.

ముఖ్యంగా రెండ‌వ భాగం విష్ణుత‌త్వాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించ‌డం పాన్ ఇండియా స‌క్సెస్ లో కీల‌కంగా మారింద‌న్న‌ది తెలిసిందే. లేదంటే సినిమాకి అంత రీచ్ ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో మూడవ‌ భాగం కోసం చందు మొండేటి ఎంపిక చేసుకునే నేప‌థ్యం ఏంట‌ని? ఉత్కంఠ  అభిమానుల్లో క‌నిపిస్తుంది. అంత‌ర్జాతీయ స్థాయిలో రూపొందించినున్న‌ట్లు ఇప్ప‌టికే రివీల్ చేసిన నేప‌థ్యంలో హిందీ స‌హా ఇంగ్లీష్ భాష‌ల్లోనూ తెర‌కెక్కించ‌డానికి ఆస్కారం  ఉంద‌ని గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి.

పైగా త్రీడీ ఫార్మెట్ లో రిలీజ్ చేస్తున్నారంటే?   ప్లానింగ్  హైలోనే ఉంద‌ని  తెలుస్తోంది. బ‌డ్జెట్ ప‌రంగానూ భారీగా కేటాయించే  ఛాన్సు ఉంది. మొద‌టి భాగాన్ని కేవ‌లం 6 కోట్ల బ‌డ్జెట్ తోనే నిర్మించారు. అది బాక్సాఫీస్ వ‌ద్ద 20 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. ఇక రెండ‌వ భాగాన్ని 15 కోట్ల‌తో నిర్మించారు. అది ఏకంగా 120 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది. ఈ నేప‌థ్యంలో మూడ‌వ భాగానికి భారీగా బ‌డ్జెట్ కేటాయించే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లోకి బ‌డా నిర్మాణ సంస్థ‌లు ఎంట‌ర్ అయ్యే ఛాన్స్  ఉంది.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News