టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యాచ్ లర్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ టాలీవుడ్ అందగాళ్లను ఆరాదించిన అమ్మాయిల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్స్ గా మారిపోతున్నారు. వరుసగా హీరోలు నితిన్ - నిఖిల్ సిద్ధార్థ్ లేడీ ఫ్యాన్స్ కు షాకిచ్చారు.
హీరో నిఖిల్ అయితే ప్రేమలో మునిగితేలడమే కాదు.. ఏకంగా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకోవడం విశేషం. ఆంధ్రాప్రాంతానికి చెందిన పల్లవి వర్మనే తన సోల్ మేట్ అని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.
ఇంతకీ ఈ పల్లవి ఎవరు? నిఖిల్ కు పరిచయం ఎలా అయ్యింది? వీరిద్దరూ ప్రేమను దాటి పెళ్లి వరకు ఎలా వచ్చారనే ప్రశ్నలు అందరిలోనూ మెదిలాయి. తాజాగా తన ప్రేమ పుట్టుక.. పరిణయం వరకు ఎలా సాగిందనేది హీరో నిఖిల్ వెల్లడించారు. ప్రేమ ఊసులు పంచుకున్నాడు.
తనది లవ్ మ్యారేజ్ అని.. పల్లవి తనకు తెలిసిన స్నేహితుల ద్వారా పరిచయం అయ్యిందని అసలు విషయం చెప్పాడు. పల్లవి ఒక డాక్టర్ అని.. తనకు సైన్స్ అంటే పిచ్చి అని ఆమె సైన్స్ గురించి చెబుతుంటే ఆసక్తితో వింటూ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసిందని తెలిపాడు.
తరుచుగా కలిసిన వీరిలో అసలు లవ్ ప్రొపజల్ ఎవరూ చేశారనే ప్రశ్న అందరికీ రావొచ్చు. ఇంకెవరు మన హీరో గారే తొలుత ప్రేమ కబురు చెప్పాడట.. అయితే అది ప్రేమ కాదు లేండీ.. ఏకంగా పెళ్లి చేసుకుంటానని పల్లవిని అడిగేశాడట.. నిఖిల్ ఐలవ్యూ అని చెప్పకుండానే పెళ్లికి ఓకే చేసుకున్నాడట.. నిఖిల్ తో పెళ్లికి పల్లవి - ఇరు ఫ్యామిలీలు ఓకే చెప్పడంతో ఏప్రిల్ 16న పెళ్లి పెట్టుకున్నారు. అయితే కరోనా కారణంగా వీరి పెళ్లి ప్రస్తుతానికి వాయిదా పడింది.