హిట్టు కొట్టడం - పేరు తెచ్చుకోవడం కంటే కూడా సక్సెస్ ను, పేరును నిలబెట్టుకోవడమే చాలా కష్టం. యువ కథానాయకుడు నిఖిల్ ఆ రెంటినీ నిలబెట్టుకోవడానికి బాగానే కష్టపడుతున్నాడు. ‘స్వామిరారా’ తర్వాత అతనెంచుకున్న సినిమాలే ఆ విషయాన్ని రుజువు చేస్తాయి. కార్తికేయ - సూర్య వెర్సస్ సూర్య.. రెండూ కూడా నిఖిల్ పేరును నిలబెట్టే సినిమాలే అయ్యాయి. సూర్య వెర్సస్ సూర్య.. కార్తికేయ స్థాయిలో పెద్ద హిట్టవకపోయినా నిఖిల్ పేరును మాత్రం చెడగొట్టలేదు. నిఖిల్ కొత్త సినిమా ‘శంకరాభరణం’ కూడా అతడి పేరును నిలబెట్టే సినిమాలాగే ఉంది. దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఐతే ‘శంకరాభరణం’ పూర్తయ్యే వరకు మరో సినిమా ముట్టుకోని నిఖిల్.. తాజాగా ఓ సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘టైగర్’ సినిమాతో తెలుగులోకి సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన తమిళ దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు నిఖిల్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా దసరా పర్వదినాన చాలా సింపుల్ గా మొదలైపోయింది. మేఘన ఆర్ట్స్ బేనర్ పై పి.వెంకటేశ్వరరావు అనే కొత్త నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర కాగా. అబ్బూరి రవి మాటలందిస్తున్నాడు. చోటా కే ప్రసాద్ ఛాయాగ్రాహకుడు. హీరోయిన్‌ని ఎంపిక చేయాల్సి ఉంది. ‘టైగర్’ తరహాలోనే ఓ ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ఈ కొత్త సినిమా చేస్తున్నాడట ఆనంద్. నవంబరులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.