సినీ సెలబ్రిటీలు సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా సంపాదిస్తారు. అందులోనూ ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురవుతుంటారు. ఇటీవల పలువురు హీరోహీరోయిన్లు ఆల్కాహాల్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ కూడా విస్కీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ''నా దగ్గర ఉన్నది నిజంగా అసాధారణమైనది. ఈ అద్భుతమైన పరిమిత ఎడిషన్ ప్యాక్ వెనుక కథ ఎవరికీ తెలియదు. ఇది ఎక్సట్రార్డినరీ కంటే తక్కువ ఏమీ కాదు. అదే ఉత్తేజకరమైనది. ఎందుకంటే నేను గొప్ప స్టోరీలను ప్రేమిస్తున్నాను'' అని పోస్ట్ చేశాడు. దీనికి నిఖిల్ స్టైలిష్ గా నిలబడి ఉన్న ఓ ఫోటోని జత చేశాడు. ఈ పిక్ లో నిఖిల్ పక్కన విస్కీ బాటిల్ మరియు పెగ్ గ్లాస్ కనిపిస్తున్నాయి.
కాగా, ఇంతకముందు సుధీర్ బాబు - నవదీప్ వంటి హీరోలు సోషల్ మీడియా మాధ్యమాలలో ఆల్కాహాల్ బ్రాండ్స్ ని ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలానే హీరోయిన్లలో పూజాహెగ్డే - రాధికా ఆప్టే - రాధికా మదన్ - ఈషా గుప్తా వంటి హీరోయిన్లు కూడా సోషల్ మీడియా లిక్కర్ బ్రాండ్ ప్రమోషనల్లో పాల్గొన్నారు. అయితే సెలబ్రిటీలు మనుషుల జీవితాలతో ఆడుకునే ఆన్లైన్ జూదాల యాప్స్ మరియు లిక్కర్ బ్రాండ్స్ కి ప్రచారం చేసి ఎంకరేజ్ చేయడం బాగాలేదని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీటికి పెయిడ్ ప్రమోషన్స్ చేయడం వల్ల పరోక్షంగా ప్రజల ఆరోగ్యాలను పాడుచేసుకోమని ప్రచారం చేయడమే అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ మద్యపాన నిషేధానికి కృషి చేయాల్సిందిపోయి ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.