చాలా విభిన్నమైన కథలతో కాస్త ఆలస్యమైనా ఎక్కువ సినిమాలు చేసేందుకు హడావిడి పడని హీరోగా నిఖిల్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ ఏడాది వచ్చిన కిరాక్ పార్టీ ఆశించిన ఫలితం ఇవ్వన్నప్పటికీ రానున్న ముద్ర కోసం ఓ రేంజ్ లో కష్టపడుతున్నాడు. ఇవాళ నిఖిల్ నిగూడార్థంతో ఉన్న చేసిన ఓ ట్వీట్ కొత్త చర్చకు దారి తీస్తోంది. ముందు ఆ మెసేజ్ ఏంటో చూద్దాం.
ఎవరైతే ప్రపంచం తమ చుట్టే తిరుగుతోంది అనుకుంటూ అవసరం లేని యాటిట్యూడ్ ని చుట్టూ విసురుతూ ఉంటారో మిత్రమా నువ్వు మరీ అంత ముఖ్యం కాదు. ప్రతి నటుడు తనతో తనే పోటీ పడాలి. మనమంతా సినిమా నిర్మాణం అనే సముద్రంలో చిన్న నీటిబొట్టులం. హడావిడి తక్కువ చేద్దాం పని ఎక్కువ చేద్దాం అని అందులో రాసాడు. అంతే కాదు ట్వీట్ తో పాటు ఒబామా ఇక అయిపోయింది అనేలా మైక్ కిందపడేసి సెలవు తీసుకునే యానిమేటెడ్ జిఐఎఫ్ ఇమేజ్ కూడా పోస్ట్ చేసాడు.
నిజానికి దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ జరుగుతోంది. నిన్న నోటా పరాజయాన్ని ఒప్పుకుంటూ ఫేస్ బుక్ లో విజయ్ దేవరకొండ ఓ పెద్ద పోస్ట్ పెట్టాడు. ఫెయిల్యూర్ తననేమి ప్రభావితం చేయదని యాటిట్యూడ్ మార్చుకోవాల్సిన అవసరం లేదని పండగ చేసుకునే వాళ్ళుంటే ఇప్పుడే చేసుకోమని నేను మళ్ళి వెనక్కు వస్తానని అందులో చెప్పడం బాగా వైరల్ అయ్యింది. మొదటివారం పూర్తి కాకుండానే విజయ్ ఇంత ఓపెన్ గా ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయడం ఊహించని విషయం. సరిగ్గా ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత నిఖిల్ యాటిట్యూడ్ గురించే ప్రస్తావిస్తూ విజయం ఎవరి సొంతం కాదని నేల మీదకు వచ్చేయాలని మెసేజ్ పెట్టడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఒకదానికి ఒకటి లింక్ చేసుకుని కౌంటర్స్ లా భావించి బదులు చెప్పుకోవడం మొదలుపెట్టారు.
ఇక్కడ విజయ్ దేవరకొండ నిఖిల్ పరస్పరం కౌంటర్లు ఇచ్చుకున్నారని అనుకోవడానికి లేదు. యాటిట్యూడ్ అనే పదం కామన్ గా ఉండటంతో ఎప్పుడు ఏ టాపిక్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న సోషల్ మీడియాకు ఇదో మెటీరియల్ లా కనిపించింది. అంతే వాడేసుకున్నారు. విజయ్ దేవరకొండ వరస సక్సెస్ లతో స్టార్ ఓపెనర్ గా మారిన నేపధ్యంలో ఆతని ఎదుగుదల మీద కొన్ని దిష్టి కళ్ళు లేకపోలేదు. వాళ్ళను ఉద్దేశించి అంత చెప్పుకున్నాడు తప్ప మరో కారణం ఉండకపోవచ్చు.
నిఖిల్ అయినా సహజంగా ఒక కొటేషన్ లా చెప్పిన మెసేజ్ ప్రత్యేకించి విజయ్ కే అని చెప్పడానికి లేదు. ఆమాటకొస్తే లైట్ బాయ్ మొదలుకుని కోట్ల రూపాయలు తీసుకునే దర్శకుల దాకా నిఖిల్ మెసేజ్ లోని అర్థం అందరికి వర్తిస్తుంది. కాకపోతే వరసగా వచ్చిన మెసేజులు కాబట్టి ఒకదానికి ఒకటి లింక్ కనపడి చర్చకు దారి తీయడం తప్ప అపార్థాలు చేసుకునేంత సీన్ కానీ విషయం కానీ అందులో లేదనే చెప్పాలి.