ఇది మరీ విడ్డూరం. నిన్న ముద్ర వివాదంలో నట్టి కుమార్ తనవైపు తప్పేమీ లేదన్నట్టు అంతా నిఖిల్ వైపే వేలెత్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇది నిఖిల్ మొదలుపెట్టింది కాదు. మొదట తనకు అవగాహన కూడా లేదు. అబిమానులు ట్విట్టర్ లో తన పేరుతో బుక్ మై షోలో ముద్ర సినిమా టికెట్లు పెట్టి అమ్ముతున్నారని తెలిసాకే నిర్మాతలను సంప్రదించి అవి తొలగించేలా చర్యలకు దిగాడు. దాని గురించే ట్విట్టర్ లో చాలా మర్యాదపూర్వకంగా ఆవేదన వ్యక్తం చేసి ఇలా ఎలా చేస్తారని ఫోటో ఆధారాలతో సహా పోస్ట్ చేసాడు.
అయితే అదే పెద్ద నేరం అనేలా నట్టి కుమార్ మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది. సవాల్ చేయడం సినిమా డైలాగులు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఇదంతా పబ్లిసిటీ కోసమే తప్ప ఇంకే కారణం కనిపించలేదు. ఎప్పుడో ఏళ్ళ క్రితం తీసిన జగపతిబాబు సినిమా ఇప్పుడు అడిగే నాధుడు లేడు. ఎక్కడో మల్టీప్లెక్సుల్లోపెట్టిన ఒకటి రెండు షోలు కూడా ఎవరూ అడిగే పరిస్థితి లేదు. బుక్ అయిన కాసిన్ని టికెట్లు కూడా నిఖిల్ పేరు పోస్టర్ చూసి కొన్నవే తప్ప జగపతిబాబుని చూసో లేక పేరు తెలియని దర్శకుడి కోసమో కాదు. అందుకే నిఖిల్ నిరసన తెలిపాడు. ఆ మాత్రానికే నట్టి కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వ్యవహరించిన తీరు ఏ కోణంలోనూ సమర్ధనీయం కాదు. పైగా వాడిన బాష ఎలాంటి సంస్కారమో కూడా అక్కడే చెప్పేస్తే బాగుండేది.
ఎవరిదైనా సినిమా బాగుండాలనే అందరూ కోరుకుంటారు. అంతే తప్ప ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల కాదు. అన్నేసి మాటలు చెప్పిన నట్టి కుమార్ రెండు సినిమాల బయ్యర్ ఒకరే కాబట్టి అలా పోస్టర్లు వాడుకుని ఉంటారని సమర్ధించుకోవడం మరో విచిత్రం.అంతే కాదు నిఖిల్ టీం తయారు చేసిన ఫాంట్ లోనే తన సినిమా డిజైన్ ఎందుకు చేయించారని కానీ ఓ మల్టీ ప్లెక్స్ వద్ద నిఖిల్ పోస్టర్ పెట్టడం తప్పని చెప్పడం కాని ఏదీ చేయలేదు. అలాంటప్పుడు అకారణంగా నిఖిల్ ని టార్గెట్ చేసి నిందించడం సరికాదు. నట్టి కుమార్ గతంలోనూ ఇలాంటి వివాదాల్లో ఉన్నారు కానీ ఈ సారి మాత్రం తనవైపు లోపాలను సమర్దించుకుని కేవలం నిఖిల్ నే వేలెత్తి చూపడం గురించి అందరూ తప్పు బడుతున్నారు.