గాంధీ పోరాడితేనే ఆంగ్లేయులు వదిలేశారా?

Update: 2015-10-03 04:58 GMT
యంగ్ హీరో నిఖిల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న త‌ర్వాత చాలా సైలెంటైపోయాడు. స్వామిరారా - కార్తికేయ‌ - సూర్య వ‌ర్సెస్ సూర్య .. వ‌రుస విజ‌యాల‌తో ఊపు మీద ఉన్న‌ప్పుడు .. స‌రిగ్గా స్టార్‌ డ‌మ్‌ ని రెట్టింపు చేసుకునేందుకు ఏం చేయాలో తెలివిగా ఆలోచించాడు. ఆ వెంట‌నే స్టార్ రైట‌ర్ కం ప్రొడ్యూస‌ర్ కోన వెంక‌ట్‌ తో అల‌యెన్స్ అయ్యి శంక‌రాభ‌ర‌ణం అనే యాక్ష‌న్ కామెడీలో న‌టిస్తున్నాడు. దీనికోసం విదేశాలు వెళ్లి న్యూలుక్ కోసం ఛేంజ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు నిఖిల్ పూర్తిగా మారిన రూపంతో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. అయితే ఇదంతా సినిమాల‌కు సంబంధించిన ప్లానింగ్‌.

హీరో అంటే కేవ‌లం సినిమాల గురించి మాట్లాడితే స‌రిపోతుందా?  ఇక వేరే లోకం ఉండ‌దా?  సామాజిక విజ్ఞానంతో ప‌నిలేదా? అనుకున్నాడో ఏమో అప్పుడ‌ప్పుడు కొన్ని ఇంటెలెక్చువ‌ల్ టాస్క్స్‌ తో ట్విట్ట‌ర్‌ లో ట‌చ్‌ లో కొస్తున్నాడు. ఇందులో హిస్ట‌రీ స‌బ్జెక్ట్‌ ని కూడా ట‌చ్ చేస్తున్నాడు. నిన్న‌టి రో్జున గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా నిఖిల్ ఓ ఇంట్రెస్టింగ్ డిబేట్‌ని ఆన్‌ లైన్‌ లో స్టార్ట్ చేశాడు. గాంధీజీ పోరాటం వ‌ల్లే ఆంగ్లేయులు మ‌న దేశాన్ని వ‌దిలి వెళ్లిపోయారా?  గాంధీజీని రియ‌ల్ హీరో అనాలా? అప్ప‌టికే రెండో ప్ర‌పంచ యుద్ధం వ‌ల్ల బ్రిటీష్ వాళ్లు పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయారు. ఇక చేసేదేం లేక ఇక్క‌డి నుంచి ప‌లాయ‌నం చిత్త‌గించారు. రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత త‌మ దేశాన్ని కాపాడుకునేందుకు మిల‌ట‌రీ సైన్యం లేనేలేదు. ఆర్థికంగానూ తీవ్రంగా న‌ష్ట‌పోయింది. అందుకే నెమ్మ‌దిగా మ‌న‌ల్ని వ‌దిలేసి సొంత దేశం కోసం వెళ్లిపోయారు.. అని చెప్పుకొచ్చాడు.

అంతేనా గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ మ‌న‌కి చాలామంది ఉన్నారు. భ‌గ‌త్‌సింగ్‌ - సుభాష్ చంద్ర‌బోస్ లాంటి అల్టిమేట్ వీరులు ఉన్నారు. వాళ్ల‌కు కూడా కాస్త గుర్తింపు నివ్వండి. అంటూ నిఖిల్ క్లాస్ తీసుకున్నాడు. ఇంట్రెస్టింగ్ .. నిఖిల్ సోష‌ల్ స‌బ్జెక్ట్ అదిరిపోయింది క‌దూ.. ఎంతో ఆలోచించేలా గ‌ట్స్‌ ని చూపిస్తున్నాడు క‌దూ? అంత ఉంది కాబ‌ట్టే త‌న‌తో పాటే కెరీర్ ప్రారంభించిన వ‌రుణ్‌ సందేశ్ - రాహుల్ లాంటి వాళ్లంతా వెన‌క్కి వెళ్లిపోతుంటే నిఖిల్ ముందు ముందుకు వెళుతున్నాడు.
Tags:    

Similar News