రామ్ గోపాల్ వర్మకు వివాదాలు కొత్తేం కాదు. తరచుగా ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ పెట్టి ఏదో ఒక కాంట్రవర్శీలో తలదూర్చడం ఆయనకు అలవాటే. ఐతే ఈసారి తలెత్తిన వివాదం ఆయన ట్వీట్లకు సంబంధించి కాదు. ఆయన చేసిన మోసానికి సంబంధించి. వర్మ కొత్త సినిమా ‘సర్కార్-3’కి కథ రాసింది ఆయన కాదట. నీలేష్ గిర్కార్ అనే ముంబయి రైటర్ అట. వర్మ తన దగ్గర కథ తీసుకుని.. టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వట్లేదని.. అలాగే డబ్బులు కూడా ఎగ్గొట్టాడని నీలేష్ ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు అతను బాంబే హైకోర్టును కూడా ఆశ్రయించాడు. కోర్టు కూడా అతడి విషయంలో సానుకూలంగా స్పందించింది.
నీలేష్ పిటిషన్ పరిశీలించిన అనంతరం.. అతడికి వర్మ ‘సర్కార్-3’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేసి అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వాలని.. అలాగే ఈ వివాదం సెటిల్మెంట్ కోసం కోర్టులో రూ.6.2 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం వర్మ ఆ ఏర్పాట్లలో ఉన్నాడు. మామూలుగా ఇంకో దర్శకుడికైతే ఈ వివాదం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ వర్మ తీరు వేరు. ఈ వివాదాన్ని సినిమా ప్రమోషన్ కు తెలివిగా వాడేయగలరాయన. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న టైంలో ఈ వివాదం కలిసొస్తుందనే భావిస్తుంటారేమో ఆయన. నిజానికి ‘సర్కార్-3’కి బాలీవుడ్లో అనుకున్నంత బజ్ అయితే లేదు. దీని ట్రైలర్ సోసోగా అనిపించిందంతే. ‘సర్కార్-3’ ఏప్రిల్ 7న.. రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/