హైదరాబాద్ కు చెందిన కాల్ హెల్త్ సర్వీస్ సంస్థలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ - బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు పెట్టుబడుటు పెట్టారు. సచిన్ 12 కోట్లు - సింధు 4 కోట్లు అందులో ఇన్ వెస్ట్ చేశారు. గత ఏడాది ఇదే సంస్థలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున - అల్లు అర్జున్ కూడా ఇన్ వెస్ట్ చేశారు. సచిన్ - నాగార్జున - చిరంజీవి రంగానికి పెద్దగా సంబంధం లేని సినీ హీరోలు - క్రీడాకారులు ఈ పెట్టుబడులు పెట్టడం వెనుక ఓ ప్రముఖ వ్యాపార వేత్త కీలకమైన పాత్ర పోషించారు. ఆయనే నిమ్మగడ్డ ప్రసాద్. ఆయన సలహా ప్రకారమే వీరందరూ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన సలహాల ప్రకారమే వీరంతా రకరకాల ప్రాజెక్టులలలో తమ డబ్బును ఇన్ వెస్ట్ చేస్తున్నారు.
అంతేకాదు, చిరంజీవి - నాగార్జున - అల్లు అరవింద్ లు కొన్ని టీవీ చానెళ్లు - ఎంటర్ టైన్ మెంట్ కంపెనీలు - స్పోర్ట్స్ క్లబ్ లు వంటి ప్రాజెక్ట్ లలో ఇన్ వెస్ట్ చేయడానికి నిమ్మగడ్డ ప్రసాదే కారణం. ఫుట్ బాల్ టీమ్ కేరళ బ్లాస్టర్స్ ఎఫ్ సీ టీమ్ ను నిమ్మగడ్డ ప్రసాద్ - సచిన్ - చిరంజీవి - నాగార్జున లు సంయుక్తంగా కొనేశారు. ప్రొ కబడ్డీ లీగ్ లోని తమిళ్ తలైవాస్ టీమ్ లో సచిన్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ లకు వాటాలున్నాయి. పుల్లెల గోపీచంద్ కూడా ఈ వ్యాపార వేత్తల జాబితాలో ఉన్నారు. వీరందరూ నిమ్మగడ్డ ప్రసాద్ సలహాలు - సూచనల ప్రకారమే ఈ వ్యాపారలలో అడుగుపెట్టి విజయవంతంగా రాణిస్తున్నారు.
అయితే, ఈ పెట్టుబడుల వెనుక ఇంకో ప్రముఖుడి హస్తం కూడా ఉంది. హైదరాబాద్ లో చాలామంది సినీ - క్రీడా ప్రముఖులకు చాముండేశ్వరీ నాథ్ సుపరిచితుడే. నిమ్మగడ్డ ప్రసాద్ కు సచిన్ ను చాముండేశ్వరీనాథ్ పరిచయం చేశారు. ఆ తర్వాత సచిన్ - ప్రసాద్ కలిసి కొన్ని ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టారు. ఎవరైనా వ్యాపారవేత్త తమ వ్యాపారలను సమర్థవంతంగా నిర్వహించి లాభాల బాటలో పయనించేలా చేయడం పెద్ద విషయమేమీ కాదు. అయితే, తనను నమ్మి పెట్టుబడులు పెట్టిన మిత్రుల వ్యాపారాలు కూడా లాభాలబాటలో ఉండేలా చూడడం నిమ్మగడ్డ ప్రసాద్ ప్రత్యేకత.