చూస్తుండగానే నితిన్ 20 ఏళ్ల కెరియర్ ను పూర్తి చేసేశాడు. మొదట్లో కాస్త బొద్దుగా ఉండి స్టెప్పులు వేయడానికి ఇబ్బంది పడిన నితిన్, ఇప్పుడు రాటుదేలిపోయాడు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ లో ఏదైనా ఫరవాలేదు అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. పరాజయాలు ఎదురైనా పక్కకి తప్పుకోమంటూ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మాచర్ల నియోజక వర్గం' రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 'గుంటూరు'లో జరిగింది.
అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో నితిన్ మాట్లాడుతూ .. "మొదటి నుంచి చివరివరకూ మీ ఎనర్జీ అదిరిపోయిందబ్బా. ఫస్టు టైమ్ నేను 'సై' హిట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చాను. ఆ తరువాత 'అ ఆ' సినిమా హిట్ అయినా తరువాత వచ్చాను. ఈ సారి మాత్రం సినిమా రిలీజ్ కి ముందుగానే వచ్చేశాను. అప్పటి నుంచి ఇప్పటికీ వరకూ మీ ప్రేమ అలాగే ఉంది. అదే ప్రేమను పంచుతూ వస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. మీ హుషారు .. ఉత్సాహం చూస్తుంటే ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనిపిస్తోంది.
నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయింది .. మీ సపోర్ట్ లేకపోతే నా జర్నీ ఇంపాజిబుల్. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు లేకపోతే నేను లేను. ట్రైలర్ ఎలా అయితే మీకు నచ్చిందో .. సినిమా కూడా అలాగే తప్పకుండా మీకు నచ్చుతుందనేది నా గట్టి నమ్మకం. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ను పెద్ద హిట్ చేశారు. అలాగే ఆగస్టు 12వ తేదీన రానున్న సినిమాను కూడా హిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాలకృష్ణగారి సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, అడిగిన వెంటనే కాదనకుండా వచ్చిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జానీ మాస్టర్ తన ఫస్టు సాంగ్ ను నాతోనే చేశాడు. నా బాడీ లాంగ్వేజ్ తనకి బాగా తెలుసు. నా డాన్స్ లో గ్రేస్ ఉందంటే అది ఆయన గ్రేసే. మున్ముందు మేం చాలా పాటలు కలిసి చేయాలి. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి మంచి పాటలను ఇచ్చాడు. అంతకుమించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అందుకు తనకి థ్యాంక్స్ చెబుతున్నాను. కృతి - కేథరిన్ ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు. అందరూ కూడా ఆగస్టు 12వ తేదీన థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేయండి" అంటూ చెప్పుకొచ్చాడు.