య్యో! భీష్మ కెమిస్ట్రీ పాప‌తో కాదా?

Update: 2020-02-25 12:31 GMT
భామ‌తో రొమాన్స్ వేరు... బావ‌తో బ్రొమాన్స్ వేరు!  భీష్మ రొమాన్స్ బ్రొమాన్స్ ఎవ‌రితో బాగా కుదిరింది? అంటే భామ‌తో కంటే సంప‌త్ తోనే ఎక్కువ‌గా కుదిరింద‌ట‌. ఇదే విష‌యాన్ని హీరో నితిన్ స‌క్సెస్ వేదిక‌పైనే చెప్పాడు. తాను ప్రేమించిన షాలినిని పెళ్లాడ‌బోతున్న వేళ భీష్మ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి మాంచి జోష్ మీద ఉన్నాడు. ఇక ఇదే ఊపులో మూడు ముడులు వేసేందుకు రెడీ అవుతున్నాడు.

భీష్మ స‌క్సెస్ వేదిక‌పై నితిన్ మాట్లాడుతూ.. ``ఈ స‌క్సెస్ నాకు చాలా ముఖ్యం. వెంకీకి కీల‌క‌మైన‌ది. సంతోషంగా ఉంది. అందరూ నాకు.. సంపత్ గారికి మధ్య ఉన్న బ్రోమెన్స్ గురించి చెబుతున్నారు. ఈ క్రెడిట్ దర్శకుడు వెంకి కుడుములకే ద‌క్కుతుంది. వెంకీ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు మరియు ఈ విజయం నాకు త‌న‌కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నేను వరుసగా మూడు ఫ్లాప్ లను ఎదుర్కొన్నా. పైగా వెంకీకి రెండవ చిత్రం చాలా ముఖ్యమైనది. అందుకే ఈ స‌క్సెస్ సంతోషాన్నిచ్చింది`` అని అన్నారు. ``నా చివరి హిట్ ఈ బ్యానర్ లోనే ద‌క్కింది. అదే బ్యానర్ లో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాను. మేము ఈ అనుబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగిస్తాం``అని నితిన్ అన్నారు.

ఎట్ట‌కేల‌కు నితిన్ ఈ ఆనందంలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నాలుగు సంవత్సరాల తరువాత హిట్ ద‌క్కింది కాబ‌ట్టి పెళ్లితో డ‌బుల్ ధ‌మాకా ద‌క్కిన‌ట్టే. ఇక సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ కి సంతృప్తిని మిగిల్చిన హిట్ చిత్రంగా భీష్మ రికార్డుల‌కెక్కింది.


Tags:    

Similar News