నిర్మాతగా క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్న నితిన్

Update: 2019-05-07 11:05 GMT
'శ్రీనివాస కళ్యాణం' తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న హీరో నితిన్ మళ్ళీ జోరు పెంచాడు.  ఈమధ్య తన పుట్టిన రోజు సందర్భంగా మూడు ప్రాజెక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. హీరోగా నటించే సినిమాలే కాకుండా నిర్మాతగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును సెట్ చేస్తున్నాడట.

హీరో కం డైరెక్టర్ విష్వక్ సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడట. ఇదో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా అని.. టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తుందని సమాచారం.  విష్వక్ సేన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తాడట.  ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వెల్లడవుతాయని అంటున్నారు. విష్వక్ సేన్ 'ఫలక్ నుమా దాస్' తో అందరి దృష్టిని తనవైపు కు తిప్పుకున్న సంగతి తెలిసిందే.  సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ యూత్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది.  

విష్వక్ సేన్ డైరెక్టర్ గా నిత్యా మీనన్ లీడ్ రోల్ లో నితిన్ నిర్మాణం అంటే క్రేజీ కాంబినేషన్ లాగా అనిపిస్తోంది కదా? నితిన్ నిర్మాతగా రెండు మూడు ప్రాజెక్టులు టేకప్ చేస్తే అవన్నీ దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి.  మరి ఈ సినిమాతో అయినా నితిన్ నిర్మాతగా మొదటి విజయం సాధిస్తాడేమో వేచి చూడాలి.
Tags:    

Similar News