కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు, రాష్ట్రాలే కాదు పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్నాయి. వైరస్ ప్రభావం వలన ఆపేసుకోక తప్పదు మరి. ఈ ఏప్రిల్ నెలలో చాలామంది శుభకార్యాలు, పెళ్లిళ్లు లాంటి వాటికీ ముహూర్తాలను సెట్ చేసుకొని పెట్టుకున్నారు. అందులో ఒకటి టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి. టాలీవుడ్ లో రీసెంట్ గా భీష్మ సినిమాతో హిట్ అందుకున్న హీరో నితిన్. తన ప్రియురాలు షాలినితో గత నెలలో ఎంగేజ్ మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అంతేగాక ఏప్రిల్ నెల 15 - 16న దుబాయ్ లో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నాడు.
ఇంతలో కరోనా వైరస్ ప్రపంచం అంతటా అన్ని దేశాల్లో చెలరేగుతుండటంతో తన డెస్టినేషన్ వెడ్డింగ్ ని కాన్సల్ చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం దేశమంతా జనతా కర్ఫ్యూలో భాగంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఎవరి ఇళ్లకు వారే పరిమితమైన సెలబ్రిటీలు వారి తదుపరి ప్లాన్స్ కూడా వాయిదా వేసుకుంటున్నారు. ఇక హీరో నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ మానుకొని అదే రోజు ముహూర్తానికి తన బంధుమిత్రుల సమక్షంలో సొంత ఇంట్లోనే వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. కరోనా ప్రభావం ఆరోగ్యాలపైనే కాదు పెళ్లిళ్ల పై కూడా ప్రభావం చూపిస్తుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.