అమ్మాయిలకు నితిన్ అంటే ఎంతిష్టమో

Update: 2018-04-04 10:30 GMT
ఈ జనరేషన్ లోనే కాదు.. ఏ తరంలో అయినా హీరోగా సెటిల్ అయిపోవడం అంటే.. మొదటగా కుర్రకారును లైన్ లో పెట్టేయాలి. తమ స్టైల్ తో అటు కాలేజ్ అబ్బాయిలను.. ఇటు టీనేజ్ అమ్మాయిలను మంత్రముగ్ధులను చేసేస్తే.. హీరోగా సెటిల్ అయిపోయినట్లే. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. యంగ్ హీరో నితిన్ కు.. మొదటి నుంచీ అండగా ఉన్నది లవ్ స్టోరీలే. ఇప్పుడు కూడా వెంట నడిచేది కూడా కాలేజ్ కుర్రకారే.

ఛల్ మోహన రంగ మూవీతో రేపు ఉదయానికల్లా థియేటర్లలోకి వస్తున్నాడు నితిన్. పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ ల పేర్లు వెనకాల ఉండడంతో బజ్ బాగానే పెరిగింది. ఈ చిత్రానికి తమన్ అందించిన స్వరాలు బాగానే యూత్ లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడీ సినిమాకు ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించాడు. మరి అందరిలాగా రెండు మాటలు చెప్పేసి.. అలా అలా పొడిపొడి కబుర్లతో ముగించేస్తే.. నితిన్ యంగ్ హీరో ఎలా అవుతాడు? తన స్పెషాలిటీ ఎలా చాటుకుంటాడు? అందుకే అక్కడ ఉన్న కాలేజ్ కుర్రకారుని ఓ క్వశ్చన్ అడిగాడు.

హీరోయిన్ మేఘా ఆకాష్ తనను ఎత్తుకున్న పోస్టర్ చూపించి.. ఇలా మీలో ఎవరైనా నన్ను ఎత్తుకుంటారా అడిగితే.. వెంటనే ఓ అమ్మాయి సై అనేసింది. జాగ్రత్త పడతావేమో అని నితిన్ హెచ్చరించినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు సరికదా.. అచ్చు పోస్టర్ లో ఉన్న మాదిరిగా.. నితిన్ ను తన వీపుపై ఎక్కించేసుకుని మోసేసింది.

ఓ కాలేజ్ అమ్మాయి కుర్ర హీరోను ఎత్తుకోవడం అంటే చిన్న విషయమేమీ కాదు. యూత్ లో ఈ యంగ్ హీరోకు ఎంతటి క్రేజ్ ఉందో చాటుతుంది ఈ సంఘటన. ప్రీ రిలీజ్ సమయంలోనే ఇంతటి హంగామా ఉంటే.. ఇక సినిమాలో నితిన్ చేసిన అల్లరి ప్లస్ రొమాన్స్.. కుర్రకారును ఏ రేంజ్ లో మురిపించనున్నాయో?


   
Tags:    

Similar News