హీరోలు - స్టార్ హీరోలు - హీరోయిన్లు.. ఎవరైనా సరే యాక్టింగ్ లోను బిహేవియర్ లోను తేడాలుంటాయేమో కానీ.. ఒక్క విషయంలో అందరూ కామన్. అదే ఓ హిట్ రాగానే రేటు పెంచేయడం. ఇప్పుడు యంగ్ హీరో నితిన్.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. అ..ఆ..తో 50కోట్ల షేర్ వసూళ్ల మార్క్ కు కూడా చేరువయ్యాడు. దీంతో తన రెమ్యూనరేషన్ పెంచడానికి ఇదే సరైన టీం అనే ఫీలింగ్ కి వచ్చినట్లు తెలుస్తోంది.
ఒక పారితోషికం విషయంలోనే కాదు.. అటు తర్వాతి ప్రాజెక్టుల విషయంలో కూడా నితిన్ అండ్ టీం తీసుకునే కేర్ బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ రేటు బాగా పెంచాడని.. అది కూడా మార్జిన్ చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఏ నిర్మాతలు వచ్చినా 5-7 కోట్ల మధ్య కోట్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒక్క హిట్ తో ఇంతగా రేట్ పెంచేస్తే ఎలా కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.
అ..ఆ.. హిట్ క్రెడిట్ పూర్తిగా త్రివిక్రమ్ ఖాతాలోకే వెళ్లినా.. ఈ మూవీలో నితిన్ నటనకు బోలెడన్ని ప్రశంసలు రావడాన్ని మర్చిపోకూడదు. అటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఈ కుర్ర హీరోకి మాంచి క్రేజ్ ఏర్పడింది. తర్వాతి సినిమాపై కూడా ఈ తరహా అంచనాలు ఉండడం సహజమే. ఇదే స్థాయిలో కాకపోయినా.. నెక్ట్స్ సినిమాని కూడా హిట్ గా మలిస్తే.. నితిన్ కి ఈ రేట్ ఇచ్చేందుకు ఎవరూ వెనకాడకపోవచ్చు.