మనం ముందే చెప్పినట్లు చాన్నాళ్ళ నుండి దిల్ రాజు మరియు నితిన్ ల మధ్యన జరుగుతున్న వైరం విభేదం అన్నీ ఖతమ్ అయిపోయాయ్. ఇప్పుడు నితిన్ హీరోగా తన తదుపరి సినిమాను చేయబోతున్నట్లు దిల్ రాజు అధికారికంగా చెప్పేశారు. పదండి ఆ సంగతేంటో చూద్దాం.
శతమానం భవతి సినిమాతోఈ ఏడాది ఏకంగా పెద్ద సక్సెస్ కొట్టడమే కాదు.. దర్శకుడు సతీష్ వెగేశ్న ఆ సినిమాతో ఊహించన విధంగా ఏకంగా ఒక నేషనల్ అవార్డును కూడా దిల్ రాజుకు తెచ్చిపెట్టాడు. ఆ తరువాత మనోడు ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తాడని అనుకున్నారు. అదే 'శ్రీనివాస కళ్యాణం'. ఎన్టీఆర్ నుండి వరుణ్ తేజ్ వరకు.. నాని నుండి రవితేజ వరకు.. ఈ సినిమా కోసం చాలామందినే సంప్రదించారు. చివరకు ఈ సినిమాను నితిన్ తో చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు నితిన్ హీరోగా.. సతీష్ వేగశ్న దర్శకత్వంలో.. దిల్ రాజు ప్రొడక్షన్లో.. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి నుండి షూటింగ్ చేస్తారట.
ఈ సినిమాకు మిక్కీజే మేయర్ సంగీతం అందించనున్నాడు. అసలే మిక్కీ దిల్ రాజుకు బాగా అచ్చొచ్చిన మ్యూజిక్ డైరక్టర్. అలాగే నితిన్ కు కూడా అ..ఆ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అతన్నే తీసుకోవాలని ఇద్దరూ అనుకున్నారట.