నితిన్ సినిమా రెడ్డి గారితో కన్ఫామా??

Update: 2016-08-05 11:30 GMT
అసలు అ..ఆ వంటి 50 కోట్ల రేంజు సినిమాను కొట్టాక కూడా.. ఇంతవరకు తన కొత్త సినిమాకు సంకేతాలు ఇవ్వలేదు హీరో నితిన్. మనోడు గతంలో ఓ రెండు సినిమాలు మొదలెట్టి.. వాటిని క్యాన్సిల్ చేసి.. అప్పుడు ఈ త్రివిక్రమ్ సినిమా ఒప్పుకున్నాడు. చూస్తుంటే ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంటుందేమో అనిపిస్తోంది.

ఇప్పటికే నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల డైరక్షన్లో రూపొందాల్సిన మూవీ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏంటి మరి? నిజానికి నితిన్ ఎవరితో సినిమా చేస్తాడు అనేది పెద్ద సందేహమే. అయితే మనోడు పెద్ద డైరక్టర్లతో ఏదన్నా యాక్షన్ ఫిలిం చేద్దామని చూస్తున్నాడట. ఇష్క్ సినిమాతో బీభత్సమైన ఫామ్ లోకి వచ్చాక అస్సలు యాక్షన్‌ అనే జానరే నితిన్ టచ్ చేయలేదు. అన్నీ రొమాంటిక్ సినిమాలే. వాటిలో ఏవో చిన్న చిన్న ఫైట్లు పెడుతున్నారు. అందుకే ఇప్పుడు సురేందర్ రెడ్డితో సినిమా చేయాలని చూస్తున్నారట.

గతంలో ఈ దర్శకుడికి నితిన్ డాడ్ సుధాకర్‌ రెడ్డి అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్‌ ధృవ సినిమా రిజల్టు బట్టి సురేందర్ రెడ్డి నితిన్ తో సినిమాను ఎప్పుడు చేస్తాడు అనేది ముడిపడి ఉంటుందని కొందరు చెబుతుంటే.. అబ్బే చరణ్‌ సినిమా పూర్తవ్వగానే నితిన్ సినిమానే అని ఇంకొందరు అంటున్నారు. లెటజ్ సీ.
Tags:    

Similar News