ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ దేవుడని.. తాను భక్తుడిని అనేవాడు నితిన్. ఐతే తొలిసారి పవన్ ను మనిషిని చేశాడతను. పవన్ కళ్యాణ్ ను ఇకపై అన్నయ్య సంబోధిస్తానని అతనన్నాడు. ‘అఆ’ విజయోత్సవం సందర్భంగా మాట్లాడుతూ పవన్ ను నితిన్ అన్నయ్య అని సంబోధించాడు. ‘అఆ’ ఆడియో వేడుకలో పవన్ తనను తమ్ముడు అన్నాడని.. కాబట్టి ఇకపై తాను ఆయన్ని అన్నయ్య అంటానని అన్నాడు నితిన్. తాను చాలా కష్టకాలంలో ఉన్నపుడు ‘ఇష్క్’ సినిమాకు వచ్చి పవన్ ఆశీర్వదించాడని.. ఆ సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయిందని.. ఇప్పుడు ‘అఆ’కు ఆడియో వేడుకకు కూడా వచ్చాడని.. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్టయిందని అన్నాడు నితిన్. ‘అఆ’కు పని చేసిన ప్రతి ఒక్కరికీ పవన్ అంటే చాలా ఇష్టమని నితిన్ అన్నాడు.
‘అఆ’ ఇంత పెద్ద హిట్టవడానికి త్రివిక్రమే ప్రధాన కారణమని నితిన్ అన్నాడు. ఇంతకుముందు ‘అఆ’ అంటే ‘అందమైన ఆహ్లదకరమైన’ సినిమా అని నిర్వచనం చెప్పిన నితిన్.. తాజాగా ‘అంతా ఆయనే’ అనే కొత్త అర్థం చెప్పాడు. ఇక్కడ ఆయన అంటే త్రివిక్రమే అని నితిన్ అన్నాడు. ఒక సినిమాకు ఇద్దరికో ముగ్గురికో మంచి పేరు వస్తే ఆ సినిమా ఓ స్థాయికి వెళ్తుందని.. అదే ఒక సినిమాలో నటించిన పది మందికి మంచి పేరొస్తే.. థియేటర్ల నుంచి బయటికి వచ్చాక అంతమంది గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటే ఆ సినిమా స్థాయే వేరుగా ఉంటుందని త్రివిక్రమ్ చెప్పాడని.. ‘అఆ’ విషయంలో అదే జరుగుతోందని నితిన్ అన్నాడు. ఈ సినిమా హీరో హీరోయిన్లకు మాత్రమే కాకుండా రావు రమేష్.. హరితేజ.. అనుపమ.. నదియా.. నరేష్.. ఇలా చాలామందికి మంచి పేరు తెచ్చిందన్నాడు.