మాది డిఫరెంట్ సినిమా అని చెప్పను... కానీ!

Update: 2016-02-16 04:00 GMT
అక్కినేని నాగార్జున అండతో చునియా అనే మహిళా డైరెక్టర్ ‘పడేశావే’ అనే సినిమాను తెరకెక్కించారు. తానే నిర్మాతగా మారి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తోంది. రాఘవేంద్రరావు, కృష్ణవంశీలాంటి దర్శకుల వద్ద పనిచేసిన చునియా... ఓ క్యూట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని తెరకెక్కించింది. ఇందులో కార్తీక్ రాజు హీరోగా నటించగా... అతని సరసన నిత్యశెట్టి - సామ్(మీరా) హీరోయిన్లుగా నటించారు. ఇదొక రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా హీరోయిన్ నిత్యశెట్టి మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు - తమిళం - హిందీ చిత్రాలన్నీ కలిపి ఓ ఇరవై దాకా వుంటాయి. ఎంతో ప్యాషన్ తో నటించా. దేవుళ్లు - అంజి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి రెండు నంది అవార్డులు కూడా అందుకున్నా. అయితే నాకు చదువుతో పాటు నటన మీద కూడా ఆసక్తి వుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఇన్ఫోసిస్ గత కొంతకాలంగా పనిచేస్తున్నా. అయితే నాకు చిన్నప్పటి నుంచి నటన మీద వున్న ఇంట్రెస్టుతో హీరోయిన్ గా రాణించాలని ట్రై చేశా. వెంటనే దర్శకురాలు చునియా మేడమ్ నాకు ‘పడేశావే’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆమె చాలా కేరింగ్ గా వుంటుంది. మహిళా దర్శకురాలు కావడంతో మా అభిప్రాయాలను ఓపెన్ గానే చెప్పడానికి వీలైయ్యేది. ఒక్కోసారి కాస్ట్యూమ్స్ విషయంలో అభ్యంతరం చెప్పినా... సలహాలు ఇచ్చినా... ఆమె మా మాటలను  ఎంతో గౌరవించేది’ అన్నారు.

ఇంకా సినిమా విషయాల గురించి మాట్లాడుతూ ‘మా సినిమా ఓ డిఫరెంట్ మూవీ అని చెప్పను... కానీ... కచ్చితంగా యూత్ ను ఆకట్టుకుంటుందని మాత్రం చెప్పగలను. ఇదొక ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. లవ్ అనేది ఇందులో ఓ ఫజిల్ లాగ వుంటుంది. అయితే ఇందులో ఎవరు ఎవర్ని పడేశారనేది మాత్రం సస్పెన్స్. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాకు ఇందులో మొదట నటించడానికి దర్శకురాలు పిలిచినప్పుడు... సెకెండ్ లీడ్ అన్నారు. కానీ.. చునియా మేడమ్ మెయిన్ లీడ్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. మాది కర్ణాటక. అయితే ఎప్పుడో నా తల్లిదండ్రుల హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయారు. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. ప్రస్తుతం తమిళంలోనూ ఓ సినిమా చేస్తున్నా. అది కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది’ అన్నారు నిత్యశెట్టి.
Tags:    

Similar News