సౌత్ హీరోయిన్స్ ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతారు. చాలా తక్కువ మంది హీరోయిన్స్ కు మాత్రమే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దక్కుతాయి. ఎక్కువ శాతం హీరోయిన్స్ తమకు ఇచ్చిన పాత్రను చేశామా - సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూడు నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చామా పని ముగించామా అన్నట్లుగా ఉంటారు. సినిమా ఏంటీ - కథ ఏంటీ అనే విషయాలను కూడా కొందరు హీరోయిన్స్ తెలుసుకునేందుకు ప్రయత్నించరు అనేది సినిమా ఇండస్ట్రీలో టాక్. అయితే అందరిలా తాను కాదంటూ నిత్యా మీనన్ పదే పదే తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది. ఏ సినిమా చేసినా కూడా ఆ కథ పూర్తిగా తెలుసుకుని, తనకు తోచిన సలహాలు - సూచనలు ఇస్తూ ఉంటుంది.
నిత్యామీనన్ సినిమా మేకింగ్ లో జోక్యం చేసుకుంటుందనే ఉద్దేశ్యంతో కూడా కొందరు ఆమెతో సినిమాలు వద్దనుకుంటారు. అడపా దడపా తెలుగులో కనిపిస్తున్న నిత్యామీనన్ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘జనతా హోటల్’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మలయాళంలో తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ మరియు నిత్యామీనన్‌ల ‘ఉస్తాద్ హోటల్’ డబ్బింగ్ రైట్స్ ను నిర్మాత సురేష్ కొండేటి దక్కించుకున్నాడు. ఈ చిత్రంను చాలా కాలంగా ఈయన వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఎట్టకేలకు ఈనెల 14న విడుదల చేసేందుకు రెడీ చేశాడు.
ఈ సందర్బంగా సురేష్ కొండేటి మీడియాతో మాట్లాడుతూ.. మొదట ఈ చిత్రానికి ‘జతగా’ అనే టైటిల్ ను ఖరారు చేశాను. ఆ టైటిల్ తోనే మొదటి టీజర్ ను కూడా విడుదల చేశాను. అయితే ఈ చిత్రానికి జతగా కంటే ‘జనతా హోటల్’ టైటిల్ అయితే బాగుంటుందని నిత్యామీనన్ సలహా ఇచ్చిందట. మొదట ఆమె సలహాను లైట్ తీసుకున్నానని, కాని ఆమె నాతో ఫైట్ చేసి మరీ జనతా హోటల్ అనే టైటిల్‌ను పెట్టించిందని, టైటిల్ మార్చడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. అందరి దృష్టి ఈ చిత్రంపై ఉందని ఈ సందర్బంగా సురేష్ కొండేటి అన్నాడు. టైటిల్ మార్చకుంటే సినిమాకు ఇంత క్రేజ్ వచ్చి ఉండేది కాదు అంటూ సినీ వర్గాల వారు కూడా అంటున్నారు. జనతా గ్యారేజ్ తరహాలో జనతా హోటల్ ఉండటంతో సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే ఈనెల 14 వరకు వెయిట్ చేయాల్సిందే.