దంగల్.. ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఇదే అతి పెద్ద బ్లాక్ బస్టర్. ‘బాహుబలి-2’ వసూళ్లను కూడా దాటేసి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిందీ సినిమా. ఐతే ‘బాహుబలి’తో రాజమౌళికి పేరొచ్చినట్లుగా.. ‘దంగల్’తో ఆ చిత్ర దర్శకుడు నితీశ్ తివారికి పేరు రాలేదు. అది అమీర్ ఖాన్ సినిమాగానే గుర్తింపు పొందింది. లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే నితీశ్ తివారి.. ‘దంగల్’ రిలీజయ్యాక కూడా చాటుగానే ఉండిపోయాడు. తన తర్వాతి సినిమా కోసం స్క్రిప్టు సిద్ధం చేసుకుంటున్న నితీశ్.. ఆలోపు తెలుగు రాష్ట్రంలో ఓ షార్ట్ ఫిలింకి శ్రీకారం చుట్టబోతుండటం విశేషం. ఈ లఘుచిత్రం పూర్తిగా కోనసీమ అందాల మధ్యే చిత్రీకరణ జరుపుకోబోతుండటం విశేషం.
కార్పొరేట్ సంస్థలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సామాజిక కార్యక్రమాలు చేపట్టాలన్న నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ సంస్థ మహిళా సాధికారత మీద ఓ షార్ట్ ఫిలిం తీయాలని నిర్ణయించుకుంది. దీన్ని నితీశ్ తివారీనే తెరకెక్కించబోతున్నాడు. ఓ తండ్రి.. యుక్త వయసుకు వచ్చిన తన కూతురికి వెంటనే పెళ్లి చేసేయకుండా ఆమె చదువు మీద ఎలా దృష్టిపెట్టి ఆమెను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాడనే కథాంశంతో ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కుతుందట. కోన సీమ అందాలు చూసి తాను మైమరిచిపోయానని.. తన షార్ట్ ఫిలిం తీయడానికి ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదని నితీశ్ తెలిపాడు. ఆయన కోనసీమలో పర్యటించిన అనంతరం అమలాపురంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ షార్ట్ ఫిలిం గురించి వెల్లడించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/