పదేళ్లు ఇండస్ట్రీలో ఉన్నా.. నమస్కారం అని పలకడానికి కూడా ఇబ్బంది పడిపోయే హీరోయిన్లు చాలామందిని చూశాం. కానీ నిత్యామీనన్ తన తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. డబ్బింగ్ విషయంలో సినిమా సినిమాకు మెరుగవుతూ ప్రస్తుతం అచ్చ తెలుగు అమ్మాయిలాగే డైలాగులు చెబుతోంది నిత్య. మరి ఇంత బాగా తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నావని ఆమెను అడిగితే ఏమందో చూడండి.
''నేను పుట్టింది కేరళలో అయినా.. పెరిగింది బెంగళూరులో. అక్కడ తెలుగువాళ్లు చాలామంది ఉన్నారు. మా నాన్న తెలుగు బాగా మాట్లాడతారు. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా తెలుగమ్మాయే. కాబట్టి తెలుగు మాట్లాడటం నాకేం పెద్ద ఇబ్బంది కాదు. ఐతే ఏ భాషలో అయినా నాకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని ముందే నిర్ణయించుకున్నా. నా మాతృభాష మలయాళం, తెలుగులో మాత్రమే కాదు.. తమిళం, కన్నడలోనూ నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. నా తొలి తెలుగు సినిమా అలా మొదలైందికి డబ్బింగ్ చెప్పుకోవడానికి పెద్దగా ఇబ్బందేమీ పడలేదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో నా పాత్రతో పాటు ఇంకో హీరోయిన్ ఇషా పాత్రకు కూడా నేనే డబ్బింగ్ చెప్పా'' అని చెప్పింది నిత్య.