టాలీవుడ్ లో ప్రతి నెలలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే అందులో చాలా వరకు కొంతమంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కానీ అందరు ఎక్కువగా సక్సెస్ కాలేకపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే చెన్నయ్ నుండి చాలా మంది వస్తున్నారు. మోడలింగ్ ప్రపంచంలో ఎంతో గుర్తింపు తెచ్చుకొని తెలుగులో చిన్న ఆఫర్ వచ్చినా చేసేస్తున్నారు.
అయితే అదే తరహాలో ఒక బ్యూటిఫుల్ మోడల్ మెంటల్ మదిలో సినిమా ద్వారా ఈ శుక్రవారం ప్రేక్షకులను పలకరించనుంది. పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ శుక్రవారం చిన్న సినిమాల సమూహంతో పాటు వీరి సినిమా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ సందర్భంగా సినిమా హీరోయిన్ నివేత పెతురాజ్ ఇంటర్వ్యూ ఇచ్చింది.
నివేదా మాట్లాడుతూ.. పుట్టింది తమిళనాడు లో అయినా పెరిగింది మాత్రం దుబాయ్ లొనే..అమ్మ తమిళ్ నాన్న తెలుగు. అయితే తమిళ్ లో ఇప్పటికే నాలుగు సినిమాలను చేశాను. ఇక మెంటల్ మదిలో సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తున్నా. ఇక 2015 లో దుబాయ్ లో మిస్ ఇండియా గా సెలెక్ట్ అయ్యాను. అక్కడ కొన్ని కంపెనీలకు మోడలింగ్ కూడా చేశాను. అయితే తమిళ్ లో మొదట మంచి ఆఫర్ రావడంతో సినిమాల్లోకి అడుగుపెట్టాను. ఇక ఇప్పుడు తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా స్వేచ్ఛతో కూడుకున్నది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నా క్యారెక్టర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అందరికి ఈజీగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నా.
హీరో శ్రీ విష్ణు కూడా సినిమాలో బాగా నటించాడు. మొదట అతను నాకు చాలా దూరంగా ఉండేవాడు. చాలా మంచి వ్యక్తి. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన నాలుగు రోజుల తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం.. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బావుంటాయి. ఈ సినిమా తర్వాత నాకు అవకాశాలు పెరుగుతాయని అనుకుంటున్నాను. ఎక్కువగా పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తాను అని ఈ న్యూ హీరోయిన్ వివరించింది.