ఈమధ్య టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్లు ఎక్కువగా కేరళ నుంచే వస్తున్నారు. అక్కడ కన్నా ఇక్కడే సక్సెస్ లు ఎక్కువగా కొట్టి లైమ్ లైట్ లోకి వస్తున్నారు. వీళ్లకు కాస్త డిఫరెంట్ గా కోలీవుడ్ లో హిట్ కొట్టి టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది నివేదా పేతురాజ్. శ్రీవిష్ణు హీరోగా ఈమధ్య వచ్చిన ’మెంటల్ మదిలో’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి మార్కులే కొట్టేసింది.
తాను నటించిన తొలి తమిళ సినిమాలాగే తొలి తెలుగు సినిమాతోనే పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉందంటోంది నివేదా పేతురాజ్. తన ఫస్ట్ తమిళ సినిమా విషయంలో ఎంత కష్టపడ్డానో అంతకు మించే తెలుగు సినిమా కోసం కష్టపడ్డానని చెబుతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్టుగా ఇక్కడా సక్సెస్ సొంతం కావడం ఆనందంగా ఉందంటోంది. ‘‘మెంటల్ మదిలో సినిమా మొదలు పెట్టేసరికి నాకు తెలుగు కొంచెం కూడా రాదు. అసలు ఈ భాషతో పరిచయం లేదు. తెలుగు అర్ధం చేసుకోవడం చాలా కష్టమైంది. డైలాగులను బట్టీపట్టడానికి ఎంతో హార్డ్ వర్క్ చేశా. ఎంతలా అంటే ఆ డైలాగులు ఇప్పటికీ బుర్రలో అలా తిరుగుతుంటాయి’’ అని చెబుతోంది నివేదా. ‘‘ఇంతకుముందు చాలా షార్ట్ టెంపర్ గా ఉండేదాన్ని. ఒకింత పంతంతో రోజుకు 16 గంటలు కష్టపడ్డ రోజులున్నాయి. దాంతో విపరీతంగా ఒత్తిడి ఫీలయ్యేదాన్ని. తరవాత మనకు దక్కాల్సింది దక్కడానికి కూడా టైం పడుతుందని సినిమాల్లోకి వచ్చాకే అర్ధమైంది’’ అని చెప్పుకొచ్చింది.
మెంటల్ మదిలో సినిమాతో వచ్చిన గుర్తిపుంతో ప్రస్తుతం ఆఫర్లు బాగానే వస్తున్నాయని అంటోంది నివేదా పేతురాజ్. తన మాతృభాష తమిళంతో సమానంగా తెలుగు సినిమాలు చేయాలన్నది తన కోరికగా చెబుతోంది. జయం రవి హీరోగా తమిళంలో రూ. 40 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న టిక్ టిక్ టిక్ సినిమాలో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ నటించింది. ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో రిలీజవుతుంది.