భామ షేప్ అవుట్ అయిందని అంటున్నారే!

Update: 2020-02-09 07:30 GMT
నాని హీరోగా నటించిన 'జెంటిల్మేన్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నివేద థామస్.  ఆ తర్వాత 'నిన్ను కోరి'.. 'జై లవకుశ'.. '118'.. 'బ్రోచేవారెవరురా'.. 'దర్బార్' సినిమాల్లో నటించింది.  ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాని-సుధీర్ బాబుల మల్టిస్టారర్ 'V' లో నటిస్తోంది.  సహజంగా టాలీవుడ్ హీరోయిన్లు అంటే గ్లామర్ ఎక్కువ నటన సున్నా అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. కాకపోతే నివేద గ్లామర్ లో సూపర్ అని చెప్పలేం కానీ నటనలో మాత్రం దిట్ట.

నివేద మొదటి నుంచి యావరేజ్ వెయిట్ తో ఉండేదే కానీ ఈమధ్య ఒక సారి బయట కనిపించినప్పుడు అధిక బరువుతో కనిపించింది. నివేద వయసు జస్ట్ 24 ఏళ్లే. అయినా ఇలా బొద్దుగా కనిపించడంతో నెటిజన్లు షాక్ తిన్నారు.  నివేద షేప్ అవుట్ అయిందని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇలా ఎవరినైనా బరువు.. శరీరం రంగు..లేదా ఇతర విషయాలను చూపించి కామెంట్లు చేయడం బాడీ షేమింగ్ కిందకు వస్తుంది. అయినా కొందరు నోటిదూల నెటిజన్లకు అవేవీ పట్టవు కదా. నివేదకు వెయిట్ సంగతి చూసుకోవాలని లేదా కెరీర్ త్వరలోనే ముగిసిపోతుందని సూచనలు ఇస్తున్నారు.

మరి 'V' సినిమాలో పాత్రకు తగ్గట్టుగా నివేద బరువు ఏమైనా పెరిగిందా లేదా అందరిలాగే బరువుపై కంట్రోల్ కోల్పోయిందా అనేది తెలియాల్సి ఉంది.  'V' సినిమాలో పాత్ర కోసం నాని కొంత వెయిట్ పెరిగి కనిపించిన సంగతి తెలిసిందే. అందుకే నివేద కూడా అలానే పాత్ర కోసం వెయిట్ పెరిగిందేమో అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News