నివేద థామస్ కు ఆఫర్ల మీద అఫర్లు!

Update: 2019-12-26 17:30 GMT
ఒక్కోసారి అంతే.  కెరీర్ స్లోగా సా...గుతూ ఉంటుంది.  అన్నీ ఉంటాయి కానీ అవకాశాలు రావు.  ఒక్కోసారి మాత్రం దానికి పూర్తిగా రివర్స్ లో అవకాశాలు వెల్లువలా వస్తాయి. ఊపిరాడనివ్వకుండా చేస్తాయి.  ప్రస్తుతం నివేద థామస్ పరిస్థితి అలానే ఉందని టాక్ వినిపిస్తోంది.  మంచి నటిగా పేరుతెచ్చుకున్నప్పటికీ ఎందుకో  నివేదకు పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ఈమధ్య నివేదకు సడెన్ గా డిమాండ్ పెరిగిందట.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఫిలిం 'పింక్' రీమేక్ లో ఒక కీలక పాత్రకు నివేదను ఎంచుకున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.  ఈ సినిమానే కాదు నివేదకు మరో ఆఫర్ కూడా వచ్చిందట.  హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం 'టక్కర్' అనే సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా నిర్మాత సుధన్ సుందరం సిద్ధార్థ్ తో వెంటనే మరో సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయిందట. ఈ సినిమాలోనే హీరోయిన్ గా నివేదకు అవకాశం దక్కిందట.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం.  ఈ సినిమాను ప్రాజెక్ట్ ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారట.  ఈ సినిమా కు జయరామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడిస్తారని సమాచారం.


Tags:    

Similar News