తెలుగునాట మలయాళీ ముద్దుగుమ్మల జోరుకు కొత్తేం కాదు. పలువురు మలయాళీ నటీమణులు తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ఆ జాబితాలో నివేదితా థామస్ ఒకరు. హీరోయిన్ అన్నంతనే సన్నగా.. మెరుపుతీగ మాదిరి అన్నట్లు చెప్పే లెక్కలకు కాస్త భిన్నంగా బబ్లీగా ఉంటారు. అయినప్పటికీ తన లుక్స్ తో.. తనదైన సోయగంతో యూత్‌ను విపరీతంగా అట్రాక్ట్ చేయటం తెలిసిందే.
22 ఏళ్ల ఈ బ్యూటీ మిగిలిన వారికి కాస్త భిన్నం. సినిమాల్లో బిజీ ఉంటూ కూడా చదువు మీదా దృష్టి పెట్టటం నివేదితా ప్రత్యేకతగా చెబుతారు. పేరున్న నటీమణులపై గాసిప్స్ సహజం. ఆ విషయంలోనూ నివేదిక కాస్త వెనుకబడినట్లేనని చెప్పాలి. ప్రస్తుతం రెండు.. మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో తన గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు.
పెళ్లికి సరైన ఏజ్ ఎదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే పెళ్లికి అదే సరైన సమయమని.. పెళ్లికి ఫలానా అప్పుడే చేసుకోవాలన్న రూల్ ఏమీ ఉండదని బదులిచ్చారు. షూటింగ్ లో ఉన్నప్పుడు జ్యూస్ అన్నంతనే వచ్చి వాలిపోవటం.. ఏ సౌకర్యమైనా చేతికి అందుబాటులో ఉంటుంది కదా.. మరి విడిగా ఉన్నప్పుడంటే.. షూట్ వరకే అవన్నీ అని.. తాను విడిగా ఉన్నప్పుడు తన పనులు తాను చేసుకోవటానికే ఆసక్తిని చూపిస్తానని చెప్పారు.
ఇండిపెండెంట్ గా ఉండటం ఇష్టమని.. ఇంట్లో గారం చేయటం లాంటివి తనకు నచ్చవని చెప్పారు. అన్ని పనులు సొంతంగా చేసుకోవటం ఇష్టమని.. పెళ్లి తర్వాత వేరే ఇంటికి వెళ్లిన తర్వాత కూడా తన పనులు తానే చేసుకోవాలనుకుంటాను కానీ.. ఇతరులపై ఆధారపడాలని అస్సలు అనుకోనన్నారు.
పెళ్లి ముచ్చట దాకా ఎందుకు?. ప్రేమ మాటేంటి? ఇప్పటివరకూ లవ్ లెటర్స్ వచ్చాయా? అంటే.. స్కూల్లోనూ.. కాలేజీలోనూ అస్సలు రాలేదన్నారు. స్కూల్లో తాను క్లాస్ లీడర్ గా ఉండేదానినని.. ఏదైనా సరే.. సూటిగా సీరియస్ గా చెప్పేదానినని.. దీంతో తనకు రొమాంటిక్ ప్రపోజల్స్ ఇంతవరకూ రాలేదన్నారు. ఈ కారణంలోనేలవ్ లెటర్స్ వచ్చి ఉండవన్న ఆమె.. తానిప్పటికీ సింగిల్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.