సర్దార్ ఆడియో.. కొత్త ట్విస్ట్‌

Update: 2016-03-06 06:06 GMT
గబ్బర్ సింగ్ మూవీలో.. నేను ట్రెండ్ ఫాలో అవను - సెట్ చేస్తా అంటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ లాంటిదైన సర్దార్ గబ్బర్ సింగ్ కోసం ట్రెండ్ సెట్ చేసే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న సర్దార్ ఆడియో ఫంక్షన్ ని అంగరంగవైభవంగా జరిపేయబోతున్నారంటూ ఇప్పటివరకూ చాలా న్యూస్ వచ్చాయి. ఇప్పుడు వాటన్నిటి కంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఒకటి బయల్దేరింది.

అదేంటంటే.. అసలు సర్దార్ గబ్బర్ సింగ్ కి ఆడియో ఫంక్షన్ చేసే ఉద్దేశ్యమే లేదట. పవర్ స్టార్ కానీ, నిర్మాత శరత్ మరార్ కానీ.. ఇప్పటివరకూ అసలు ఆడియో ఫంక్షన్ కోసం ఎలాంటి ఏర్పాట్లు మొదలుపెట్టలేదు. కనీసం ఆ టాపిక్ ని కూడా ఎవరూ తేవడం లేదు. దీనికి కారణం.. అసలు ఆడియో ఫంక్షన్ వద్దని ఇప్పటికే డిసైడ్ అయిపోవడమే అంటున్నారు. ఇప్పటికీ సర్దార్ సినిమాకి సంబంధించి ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండడం, సాంగ్స్ కూడా పిక్చరైజ్ చేయాల్సి ఉండడంతో.. ఆడియో ఫంక్షన్ కోసం డేట్స్ వేస్ట్ చేసుకోవడం ఇష్టంలేదట పవన్ కళ్యాణ్ కి.

అసలు ఇలాంటి వేడుకలు నచ్చవని పవన్ ఓపెన్ గానే చెబ్తూ ఉంటాడు. ఈ సారికి మాత్రం ఓ మంచి ముహూర్తం చూసుకుని డైరెక్ట్ గా మార్కెట్ లోకి వదిలేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇది పవన్ కళ్యాణ్ సృష్టించబోయే కొత్త ట్రెండో.. లేక ఆయన మార్క్ లో ఇస్తున్న ట్విస్టో అర్ధంకావడం లేదు ఫ్యాన్స్ కి.
Tags:    

Similar News