పెద్ద హీరోల సినిమాలు రిలీజయ్యాయంటే చాలు.. ఆంధ్రప్రదేశ్ లో ముందు రోజు అర్ధరాత్రి నుంచే సందడి మొదలైపోతుంది. చిన్న.. పెద్ద అని తేడా లేకుండా అన్ని పట్టణాలు.. నగరాల్లో అర్ధరాత్రి.. తెల్లవారుజామున బెనిఫిట్ షోలు పడతాయి. వాటికి టికెట్ల రేట్లు డిమాండును బట్టి 200.. 300.. 500 ఇలా ఉంటాయి. ఐతే తెలంగాణలో ఈ బెనిఫిట్ షోల సంస్కృతి ముందు నుంచి లేదు. ఒక్క హైదరాబాద్ మినహాయిస్తే తెలంగాణలో ఎక్కడా కూడా బెనిఫిట్ షోల మాటే ఉండదు. యధావిధిగా ఉదయం 11 గంటలకే తొలి షో పడుతుంది. కానీ హైదరాబాద్ లో మాత్రం కొన్ని థియేటర్లలో తెల్లవారుజామున బెనిఫిట్ షోలు పడుతుంటాయి.
ఐతే ఏపీలో లాగా హైదరాబాద్ లో బెనిఫిట్ షోల టికెట్ల రేట్లు రీజనబుల్ గా ఉండవు. మినిమం వెయ్యి రూపాయల రేటు పెట్టి టికెట్లు అమ్ముతుంటారు. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సినిమాలు వస్తే అంతే సంగతులు. టికెట్ల రేట్లు రూ.2 వేలు.. రూ.3 వేలకు కూడా పెంచేస్తారు. ‘బాహుబలి’ సినిమాకు సైతం అప్పట్లో రూ.2 వేలకు పైగా రేటు పెట్టి టికెట్లు అమ్మారు. ఇక ఆకాశాన్నంటే అంచనాల మధ్య రిలీజవుతున్న బాహుబలి-2కు బెనిఫిట్ షోలు వేస్తే టికెట్ల రేట్లు ఎలా ఉంటాయో అంచనా వేయొచ్చు. ఆల్రెడీ రూ.3 వేల రేటుతో షోలు వేయడానికి సన్నాహాలు కూడా చేసుకున్నాయి కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు. ఐతే తెలంగాణ ప్రభుత్వం వారికి షాకిచ్చేలాగే కనిపిస్తోంది. ఈ సినిమాకు అదనంగా వారం రోజుల పాటు ఒక షో ఆడించుకోవడానికి అవకాశమిచ్చిన నేపథ్యంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వనట్లే. ఐదు షోలంటే ఉదయం 8కే తొలి షో పడుతుంది కాబట్టి బెనిఫిట్ షోల అవసరం ఉండదు. ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ‘కాటమరాయుడు’కు సైతం అనుమతి రాలేదు. ఇప్పుడు ‘బాహుబలి-2’కు కూడా నో చెబుతున్నారు కాబట్టి బెనిఫిట్ షోల పేరుతో దోపిడీకి పాల్పడే వాళ్లకు చెక్ చెప్పినట్లే. కానీ ఏపీలో మాత్రం అర్ధరాత్రి నుంచే భారీ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/