ప్రపంచవ్యాప్తంగా విస్త్రతంగా చర్చల్లోకి వచ్చిన వార్ ఎపిక్ సినిమా బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇంకో ఆరు రోజుల్లో (10న) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజవుతోంది. ఆ తర్వాత ఇతర భాషల్లోకి అనువాదమవుతుంది. అయితే ఒకరోజు ముందే అంటే ఈనెల 9న ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు పేరుతో భారీగా టిక్కెట్ రేట్లు బాదేసి ఆ వచ్చిన మొత్తాల్ని నూతన (ఏపీ) రాజధాని నిర్మాణానికి అందిస్తారన్న ప్రచారం సాగింది. అన్ని ప్రధాన నగరాల్లో బెనిఫిట్ షోలు వేస్తున్నారని వార్తలొచ్చాయి.
అయితే ఇవన్నీ గాలివార్తలేనని కొందరు కొట్టి పారేశారు. దీనిపై బాహుబలి పంపిణీదారుడు సాయి కొర్రపాటి స్పందిస్తూ.. ఇదంతా బుల్‌షిట్. కేవలం రూమర్ మాత్రమే. ఒకరోజు ముందే షోలు వేయడం అన్నది ఉండదు. 10న మాత్రమే సినిమా రిలీజవుతుంది. ఇలాంటి వార్తల్ని పట్టించుకోవద్దని అన్నారు. ఇలాంటివన్నీ గాలివార్తలేనని కట్టి పారేశారు. బల్క్‌గా సినిమా టిక్కెట్లు కొనుక్కోవాలంటే పంపిణీదారులు, బయ్యర్ల ద్వారా సాధ్యమవుతుందని, ఔత్సాహికుల నుంచి టిక్కెట్ల పంపిణీ ఉంటుందని చెప్పుకొచ్చారు. థియేటర్ కౌంటర్లలోనూ టిక్కెట్లు లభ్యమవుతాయని చెప్పారు. అయితే ఆన్‌లైన్ సౌలభ్యం వల్ల తొలివారంలో కౌంటర్ వరకూ వెళ్లే సీనే లేదని అభిప్రాయ పడ్డారు.