టాప్ స్టోరి: బూతుకు సెన్సార్ లేదా?

Update: 2019-02-14 11:56 GMT
ఇటీవ‌ల పెద్ద తెర‌పై న్యూడ్ కంటెంట్ .. రా మెటీరియ‌ల్ పెచ్చు మీరుతున్న సంగ‌తి తెలిసిందే. లిప్ లాక్ లు, బెడ్ రూమ్- బాత్రూమ్ స‌న్నివేశాల‌తో పాటు బూతు డైలాగులు పెట్రేగిపోతున్నాయి. అయితే వీటి విష‌యంలో సెన్సార్ నిబంధ‌న‌లు అడ్డు ప‌డ‌డం లేదా? అంటే సెన్సార్ రూల్స్ ని భేఖాత‌ర్ చేస్తున్నార‌నే అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల రిలీజ‌వుతున్న‌ ట్రైల‌ర్స్ అన్నీ బూతు కంటెంట్ తో య‌థేచ్ఛ‌గా రిలీజైపోతున్నాయి. అవి యూట్యూబ్‌ లో ట్రెండింగ్ అయిపోతున్నాయి. అంటే దానికి సీబీఎఫ్‌ సీ నిబంధ‌న‌లు అడ్డు ప‌డ‌వ‌ని తేలిపోయిన‌ట్టే. ఇక పోతే ఫైన‌ల్ గా సెన్సార్ గ‌డ‌ప మీద మాత్రం పెచ్చుమీరుతున్న బూతును క‌ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇటీవ‌ల రిలీజైన కొన్ని తెలుగు సినిమాల ట్రైల‌ర్ల‌లో బూతు కంటెంట్ య‌థేచ్ఛ‌గా క‌నిపించింది. ఏడు చేప‌ల క‌థ‌ - చీక‌టి గ‌దిలో చిల‌క్కొట్టుడు వంటి ట్రైల‌ర్లు పూర్తిగా బూతు కంటెంట్ నిండినవిగా క‌నిపించాయి. తాజాగా రిలీజైన `ఫ‌ల‌క్ నుమా దాస్` ట్రైల‌ర్ లో ప‌చ్చి బూతులపైనా తెలుగు మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నైజాం యాక్సెంట్ తో వ‌స్తున్న ఈ సినిమాలో లెక్క‌కు మిక్కిలిగా బూతులు ఉన్నాయి. లం... జొడ‌కా..  - దెం.. యండ్రా.. - బాడ‌కో.. - గు.. ప‌..దె...గి నామా..వంటి బూతు డైలాగులు వేడెక్కిస్తున్నాయి. ఎంత‌గా రా మెటీరియ‌ల్ సబ్జెక్ట్  ఎంచుకున్నా మ‌రీ ఇంత దారుణ‌మైన బూతులు - తిట్లు య‌థేచ్ఛ‌గా చూపించేస్తారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి సినిమాల విష‌యంలో సెన్సార్ నిబంధ‌న‌లు ఏమ‌య్యాయి?... సెన్సార్ అవ్వ‌కుండానే ట్రైల‌ర్ చూపించొచ్చా? అంటూ ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

అయితే గ‌త కొంతకాలంగా బాలీవుడ్ లోనూ ఇదే శైలి క‌నిపిస్తోంది. ఈ త‌ర‌హా వివాదాలు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌లే `గ‌ల్లీ బోయ్ `ట్రైల‌ర్ లోనూ సేమ్ స‌న్నివేశం క‌నిపించింది. ఈ సినిమాలో చాలా సీన్లు క‌ట్ చేశారని తెలిసింది.  13 సెకండ్ల కిస్సింగ్ సీన్‌ - బూతు డైలాగులు - లిక్క‌ర్ కంపెనీ లోగోల‌కు క‌టింగ్ ప‌డింది. ఇంత‌కుముందు విద్యాబాల‌న్ `డ‌ర్టీపిక్చ‌ర్` స‌హా ప‌లువురు తెర‌కెక్కించిన‌ బోల్డ్  రా ఫిలింస్ కి సెన్సార్ కోత ప‌డింది. రాయ్ ల‌క్ష్మీ `జూలీ2`కి స‌న్నీలియోన్ సినిమాల‌కు సెన్సార్ అడ్డంకులు త‌ప్ప‌లేదు. ఇక మురికివాడ‌లో పెరిగిన ర్యాప‌ర్ ఒరిజిన‌ల్ లైఫ్ లోని బూతును గ‌ల్లీ బోయ్స్ లో య‌థాత‌థంగా చూపించాల్సి రావ‌డంతోనే సెన్సార్ క‌ట్స్ త‌ప్ప‌లేదు. అలాగే ఫ‌ల‌క్ నుమా దాస్ విష‌యంలోనూ ఓల్డ్ సిటీ యాస‌ - గ‌ల్లీల్లోని క‌ల్చ‌ర్ చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే నేటివిటీ ని బూతు డైలాగుల్ని య‌థాత‌థంగా ఉప‌యోగించారు. మ‌రి రిలీజ్ ముంగిట సెన్సార్ క‌ట్స్ లేకుండా.. బీఫ్ చేయ‌కుండా ఉంటుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News