ఏ హీరోకైనా ఓ భారీ డిజాస్టర్ పడిందంటే మార్కెట్ కాస్త తగ్గుతుంది. ముందు సినిమా ఫలితాన్ని బట్టి తరువాత సినిమా బిజినెస్ జరుగుతూ వుంటుంది. కొన్ని సార్లు ఎంతటి స్టార్ హీరోకైనా భారీ డిజాస్టర్ పడితే తదుపరి సినిమాని కొనడానికి బయ్యర్స్ ముందుకు రాని పరిస్థితులు టాలీవుడ్ లో చాలానే వున్నాయి. అయితే ఓ హీరో విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ 'లైగర్'.
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ స్థాయిలో విడుదలై ఊహించని విధంగా డిజాస్టర్ అనిపించుకుని షాకిచ్చిన విషయం తెలిసిందే. మూడున్నరేళ్ల పాటు విజయ్ తేవరకొండ శ్రమించి భారీ ఆశలు పెట్టుకున్న ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని షాక్ కు గురిచేసింది. అంతే కాకుండా మేకర్స్ కి, బయ్యర్స్ కి భారీ నష్టాలని తెచ్చిపెట్టింది. ఈ విషయంలో దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్ కు, బయ్యర్స్ కి మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
నష్టాల రికవరీ విషయంలో బయ్యర్స్ కి, దర్శకుడు పూరి జగన్నాథ్ కు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 'లైగర్' వివాదం చిలికి చిలికి పెను వివాదంగా మారి దర్శకుడు పూరి జగన్నాథ్ పోలీస్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన 'లైగర్' విజయ్ దేవరకొండ కెరీర్ ని, అతని తదుపరి ప్రాజెక్ట్ బిజినెస్ ని ప్రభావితం చేస్తుందని అంతా భావించారు. అయితే అది ఎక్కడా కనిపించడం లేదు. 'లైగర్' తరువాత విజయ్ దేవరకొండ దర్శకుడు శివ నిర్వాణతో కలిసి 'ఖుషీ' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సామ్ అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తోంది. మరో ఐదు వారాలు షూటింగ్ బ్యాలెన్స్ గా వున్న ఈ మూవీపై తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. షూటింగ్ దశలో వున్న ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్టుగా తెలుస్తోంది.
హిందీ అనువాద హక్కులతో కలిపి నాన్ థియేట్రికల్ హక్కుల కోసం రూ. 90 కోట్లకు మించి బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. సమంత, విజయ్ దేవరకొండల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న రొమాంటిక్ మూవీకి ఈ రేంజ్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కశ్మీర్ నేపథ్యంలో సాగు రొమాంటిక్ ప్రేమకథగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. 'లైగర్' ఫ్లాప్ ప్రభావం 'ఖుషీ' బిజినెస్ పై పడకపోవడంతో రౌడీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.