3డి ఖర్చులైనా వస్తాయా

Update: 2019-08-07 09:40 GMT
ఇంకో రెండు రోజుల్లో కన్నడలో భారీ ఎత్తున నిర్మించిన కురుక్షేత్ర తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రూపంలో సమాంతరంగా విడుదలవుతోంది. కానీ దాని తాలూకు కనీస హడావిడి కానీ హైప్ కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఆన్ లైన్ బుకింగ్ ఓపెన్ చేస్తే చాలా చోట్ల ఇంకా ఒక్క టికెట్ కూడా తెగని పరిస్థితి నెలకొని ఉంది . పోనీ కర్ణాటకలో దీనికి బాహుబలి రేంజ్ లో స్వాగతం పలుకుతున్నారా అంటే అంత సీన్ అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. అందులోనూ మొదటి పౌరాణిక 3డి సినిమాగా దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు.

బాహుబలి కూడా త్రీడిలో తీయలేదు రాజమౌళి. కాని కన్నడ నిర్మాత మునిరత్న మాత్రం పెద్ద సాహసానికే ఒడిగట్టారు. ట్రైలర్ కొంత గందరగోళంగా అనిపించగా ఆడియోకు సైతం మరీ గొప్ప రెస్పాన్స్ రాలేదు. మరి ఈ కురుక్షేత్రం ఎంతమేరకు జనాలకు కనెక్ట్ అవుతుందో చూడాలి. అసలే టీవీ ఛానల్స్ సినిమాలను తలదన్నే స్థాయిలో గ్రాఫిక్స్ లో ఇదే మహాభారత గాధను చాలాసార్లు చూపించాయి.

అదే కథను మళ్ళి తెరమీద చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారా అంటే సమాధానం ఎల్లుండి దొరుకుతుంది.  అసలే నాగార్జున మన్మధుడు 2 రేస్ లో అన్నింటికన్నా ముందుంది. మరోవైపు అనసూయ కథనం కూడా ఎటాక్ ఇస్తోంది. అర్జున్-స్నేహ-సోనూ సూద్ తప్ప పెద్దగా తెలిసిన మొహాలు ఇందులో లేకుండా పోయాయి. ఈ నేపధ్యంలో పబ్లిసిటీని పూర్తిగా గాలికి వదిలేసిన కురుక్షేత్రం 3డి ఎంత వరకు బాక్స్ ఆఫీస్ యుద్ధంలో నెగ్గుకు వస్తుందో వేచి చూడాలి
Tags:    

Similar News