ఒక లైలా కోసం అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ముకుందలో గోపికగా అలరించిన పూజా హెగ్డేకు.. టాలీవుడ్ గుర్తింపుతో పాటు ఛాన్సులు వస్తున్న టైమ్ అది. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చేసింది. అది కూడా హృతిక్ రోషన్ సరసన అశుతోష్ గోవారికర్ తీస్తున్న మొహెంజొదారో మూవీలో కావడంతో.. ఇక ఈ భామ ఎక్కడా తగ్గలేదు. తీరా ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలేసరికి పాపం పాపను పట్టించుకునేవాళ్లే లేకుండా పోయారు.
బాలీవుడ్ పై పెట్టుకున్న ఆశలన్నీ ఇలా కలలుగా మిగిలిపోవడంతో.. ఇప్పుడు మళ్లీ తన పొడుగు కాళ్ల అందాన్ని.. నాభి సోకులను.. వీపు సోయగాలను చూపించుకుంటూ ఫోటో షూట్స్ చేయించుకుంటోంది. అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పని చేతులారా తెచ్చేసుకుంది. నిజానికి మొహెంజొదారోలో నటిస్తున్నపుడే అమ్మడికి మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన.. హరీష్ శంకర్ మూవీ కోసం కూడా అడిగారు. కానీ మొహెంజొదారో రిలీజ్ అయ్యాక తన రేంజ్ మారిపోతుందని.. రెమ్యూనరేషన్ బాగా పుచ్చుకోవచ్చని.. బాలీవుడ్ లోనే పాగా వేయచ్చనే అంచనాలతో నో అనేసింది పూజా.
ఇప్పుడు తనే చేస్తానంటున్నా సరే.. మన దువ్వాడ జగన్నాథం అండ్ టీ వద్దు బాబోయ్ అంటున్నారు. ఇప్పటికి తమిళ్ - తెలుగు - హిందీ.. మొత్తం 3 భాషల్లో 4 సినిమాల్లో ఈ భామ నటిస్తే.. అన్నీ డిజాస్టర్లుగా మిగిలిన పరిస్థితిలో.. ఇక ఈమెను పట్టించుకునే మేకర్స్ ఉంటారంటారా?