‘జనతా గ్యారేజ్’తో ఎన్టీఆర్ దశ తిరిగిపోతుందన్న ఆశతో ఉన్నారు నందమూరి అభిమానులు. ఈ దశ తిరిగే క్రమంలో అతడికి కేరళలోనూ మంచి మార్కెట్ వచ్చేస్తుందని.. అల్లు అర్జున్ లాగే అతనూ అక్కడ పెద్ద స్టార్ అవుతాడని అంచనా వేశారు. మోహన్ లాల్ అండ ఎన్టీఆర్ కు బాగా కలిసొస్తుందని భావించారు. కానీ ఇప్పుడు ఆ మోహన్ లాలే ఎన్టీఆర్ కు అడ్డంకిగా మారుతున్నాడు.
మలయాళంలో మొదట్నుంచి ఇది మోహన్ లాల్ సినిమా అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన్నే ముందు పెట్టి ప్రచారం చేస్తున్నారు. పోస్టర్లలో ఆయనే నిండిపోతున్నారు. టీజర్లో సైతం ఆయనే లీడ్ తీసుకున్నారు. ఇప్పటిదాకా ఎన్టీఆర్ మలయాళ వెర్షన్ ప్రమోషన్లలో ఎక్కడా హైలైట్ అవ్వలేదు. అసలు మలయాళ వెర్షన్లో ఎన్టీఆర్ పాత్ర తగ్గించేసి.. మోహన్ లాలే సినిమా అంతా కనిపించేలా కథను మార్చారేమో అన్న సందేహాలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆ అనుమానాలు బలపడేలా చేస్తోంది. ఈ పోస్టర్లో అసలు ఎన్టీఆరే లేడు. మోహన్ లాల్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేస్తోంది మోహన్ లాలే. ప్రమోషన్ కూడా ఆయన సంస్థే చేస్తోంది. మరి ఇలా ఎన్టీఆర్ ను పక్కనబెట్టేయడం అతడి అభిమానులకు రుచించట్లేదు. మరి సినిమా రిలీజయ్యాక ఎన్టీఆర్ కు కేరళలో ఏమాత్రం పేరొస్తుందో చూడాలి.