ఇవాళ నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అభిమానులు పండగలా ఫీలవుతారు. మరోసారి హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం బాలయ్య కు కించిత్ కూడా లేదు. కారణం వియ్యంకుడి పార్టీ మరీ దారుణంగా పరాజయం పాలై అధికారం కోల్పోవడమే. దానికి తోడు నాన్న ఎన్టీఆర్ కు గొప్ప నివాళిగా ఇద్దామనుకుని తీసిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ చేదు ఫలితాలను ఇవ్వండి ఇంకా ఆయనకు డైజెస్ట్ అవుతున్నట్టు లేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడీ బర్త్ డే మూమెంట్ అంత స్పెషల్ గా ఫీలవుతారని చెప్పలేం. ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయింది. కొత్త సినిమా మొదలుకానే లేదు. బోయపాటి శీనుతో అన్నారు. తర్వాత వాయిదా పడింది. లేదు కేఎస్ రవికుమార్ స్క్రిప్ట్ రెడీగా ఉందన్నారు. దానికీ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. ఉంటుందని ఒకసారి లేదని మరోసారి ఇలా గంటకో ప్రచారం జరుగుతోంది
పోనీ ఇవాళ ఎలాగూ పుట్టిన రోజు కదా అధికారిక ప్రకటన ఏమైనా ఉంటుందా అంటే ఇప్పటికైతే నిర్మాత సి కళ్యాణ్ నుంచి ఎలాంటి న్యూస్ లేదు. మరో వైపు సోషల్ మీడియాలో సదరు సంస్థ నుంచి వచ్చినట్టుగా డిజైన్ చేసిన పోస్టర్ హల్చల్ చేస్తోంది. దాంట్లో డైరెక్టర్ గా రవి కుమార్ పేరే ఉంది. ఇది నిజమో కాదో నిర్ధారణ లేదు. కళ్యాణ్ ట్విట్టర్ లో కల్కి న్యూస్ ఉన్నాయి కానీ దీనికి సంబంధించిన సమాచారం లేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మీడియాకు సైతం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సైలెంట్ గా ఈ నెల 13న కొత్త సినిమా మొదలుపెడతారని మరో టాక్ వచ్చింది. ఏది నిజమో ఏది కాదో ఈ అయోమయం తీరాలంటే బాలయ్యనో లేదా నిర్మాత కల్యాణో చెబితే తప్ప సస్పెన్సు తీరదు