మూడు బడా సినిమాలకు బయ్యర్స్ రావట్లే?

Update: 2017-06-22 08:12 GMT
స్టార్ హీరోల సినిమాలంటే రిలీజ్ కి చాలా కాలం ముందే బిజినెస్ అయిపోతుందనే సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలకు అయితే.. అనౌన్స్ మెంట్ రోజు నుంచే బిజినెస్ స్టార్ట్ చేసి.. షూటింగ్ ప్రారంభించే నాటికే టేబుల్ ప్రాఫిట్ సంపాదించేసిన దాఖలాలు కూడా ఉంటాయి.

కానీ టాలీవుడ్ మూడు అప్ కమింగ్ సినిమాలకు మాత్రం ఓవర్సీస్ లో అసలు బిజినెస్ కావడం లేదు. కొనేవాళ్లే కనిపించడం లేదు. ఇందుకు వారు చెబుతున్న రేట్లే ప్రధాన కారణంగా చెప్పచ్చు. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న బైలింగ్యువల్ మూవీ స్పైడర్. సహజంగా మహేష్ సినిమాలకు ఓవర్సీస్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ స్పైడర్ విషయంలో లెక్కలు తేడా వచ్చాయి. ఈ చిత్రానికి ఏకంగా 22-25 కోట్ల మేర డిమాండ్ చేసి షాక్ ఇచ్చారట నిర్మాతలు. అందుకే బయ్యర్స్ దూరంగా ఉన్నారని చెప్పచ్చు. ఇప్పుడు 16 కోట్లకు డీల్ పూర్తి చేద్దామని నిర్మాతలు భావిస్తున్నా కొనేవాళ్లు కనిపించడం లేదు.

ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ పరిస్థితి కూడా ఇదే. మొదట 16 కోట్లతో ప్రారంభించిన ప్రొడ్యూసర్.. ఇప్పుడు 14 కోట్లకు తగ్గినా రైట్స్ తీసుకునేందుకు ఎవరూ రావడం లేదు. ఇక పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీకి 20 కోట్లు అడుగుతున్నారు. ప్రస్తుతం రెవెన్యూ షేరింగ్ విషయంలో కొత్త నిబంధనల కారణంగా.. ఈ డీల్స్ సెట్ కావడం లేదని ట్రేడ్ జనాలు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News