లవర్ సైలెంట్ గా ఉన్నాడే!

Update: 2018-07-10 07:22 GMT
దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఏ సినిమా అయినా సరే హీరోతో సంబంధం లేకుండా భారీ హడావిడి ఉంటుంది. మార్కెటింగ్ చేయటంలో మంచి నైపుణ్యం ఉన్న దిల్ రాజు ఇలాంటి స్ట్రాటజీలతోనే రొటీన్ సినిమాలను కూడా యావరేజ్ నుంచి హిట్ అనిపించుకునే స్థాయికి వెళ్లేలా చేస్తారు. కానీ ఈ ఏడాది ఏడు నెలల గ్యాప్ తర్వాత  వస్తున్న ఆయన మొదటి సినిమా లవర్  విషయంలో నిర్లిప్తంగా ఉండటం అందరికి కొత్త అనుమానాలు రేపుతోంది. రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన లవర్ ని ఈ నెల 20న విడుదల చేస్తారని గతంలో చెప్పారు. కానీ దాని తాలూకు ప్రమోషన్ కానీ సందడి కానీ ఆన్ లైన్ లో కూడా కనిపించడం లేదు. కారణం తెలియదు కానీ మరీ ఇంత డల్ గా ఉంటే అది నేరుగా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించడం ఖాయం.

అసలే రాజ్ తరుణ్ బాగా బ్యాడ్ టైంలో ఉన్నాడు. ఈ ఏడాది రంగుల రాట్నంతో పాటు రాజుగాడు డిజాస్టర్ గా మిగలడంతో కుర్రాడు కాస్త నిరాశలో ఉన్నాడు. పైగా పోయిన ఏడాది కూడా కలిసి రాలేదు. అప్పుడూ రెండు ప్లాపులు వచ్చాయి. సో లవర్ పెద్ద బ్రేక్ ఇవ్వాలని గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఐదుగురు సంగీత దర్శకులతో కంపోజ్ చేయించిన మ్యూజిక్ బాగానే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. టీజర్ వదిలారు కానీ ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించలేదన్నది వాస్తవం. రాజ్ తరుణ్ పిలక పెట్టి హీరోయిన్ గా కొత్త అమ్మాయి రిద్ధి వర్మను తీసుకోవడం తప్ప మిగిలిన సెటప్ అంతా రొటీన్ గానే ఉంది. ట్రైలర్ లో ఏమైనా స్పెషల్ ఉంటుందేమో అని ఎదురు చూస్తున్నారు ఫాన్స్. లవర్ కనక తేడా వస్తే రాజ్ తరుణ్ తరువాతి సినిమాల మీదే కాదు మార్కెట్ మీద కూడా బాగా నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఇంతా తెలిసి లవర్ విషయంలో దిల్ రాజు గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టో.


Tags:    

Similar News